అన్వేషించండి

Satellite Towns: బెంగళూరు శివార్లలో 5 శాటిలైట్ సిటీలు, ప్లాన్ రెడీ చేస్తున్న హౌజింగ్ బోర్డ్

Satellite Towns: బెంగళూరు శివార్లలో 5 హైటెక్ శాటిలైట్ టౌన్స్‌ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోంది.

Satellite Towns in Bengaluru:


ఒత్తిడి తట్టుకోలేక 

బెంగళూరు సిటీలో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతోంది ఆ సిటీ. ట్రాఫిక్ సవాలు దాటడం ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఈ ప్రెజర్‌ని తగ్గించేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరు శివార్లలో 5 హైటెక్ శాటిలైట్ సిటీలు నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర హౌజింగ్ మినిస్టర్ జమీర్ అహ్మద్ దీనిపై ఓ రిపోర్ట్ తయారు చేయాలని కర్ణాటక హౌజింగ్ బోర్డ్‌ (KHB)కి ఆదేశాలిచ్చారు. ఒక్కో శాటిలైట్ టౌన్‌లో (Satellite Towns) వెయ్యి విల్లాలు కట్టేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 500 ఎకరాల్లో ఈ టౌన్‌లను కట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. మొత్తంగా అన్ని శాటిలైట్ టౌన్స్‌లలో కలిపి 25 వేల ఇళ్లు కట్టనున్నారు. KHBతో ఇప్పటికే రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రి జమీర్ అహ్మద్. బెంగళూరుకి డిమాండ్ పెరుగుతోందని, ఈ డిమాండ్‌కి తగ్గట్టుగా సిటీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. 

"బెంగళూరుకి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడ విల్లాలు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వాళ్లకు ఈ సౌకర్యం కోసం చూస్తున్నారు. అందుకే...ఈ ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌కి అనకూలమైన స్థలం ఎక్కడుందో వెతుకుతున్నాం. త్వరలోనే గుర్తించి ప్రాజెక్ట్ మొదలు పెడతాం"

- జమీర్ అహ్మద్, కర్ణాటక హౌజింగ్ మినిస్టర్ 

ఆయా స్థలాల ఓనర్లు, కర్ణాటక హౌజింగ్ బోర్డ్ సగం సగం ఖర్చులు భరించుకుని ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. నైరుతి బెంగళూరులో హౌజింగ్ ఏజెన్సీ నేతృత్వంలో ఓ టౌన్‌షిప్ కట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 2 వేల ఎకరాల్లో వీటిని నిర్మించనున్నారు. మొత్తం 10 వేల ఇళ్ల కట్టనున్నారు. 

ట్రాఫిక్..ట్రాఫిక్‌..

బెంగళూరు అనగానే చాలా మంది భయపడేది ట్రాఫిక్ కే. అక్కడి ప్రజలు గుబులు చెందేది ట్రాఫిక్ అంటేనే. ఇంట్లో నుండి రోడ్డెక్కామంటే గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందోనని భయపడుతుంటారు. కొన్ని ఏరియాల్లో చిన్న ట్రాఫిక్ జామ్ ఏర్పడితే అందులో గంటల తరబడి మగ్గిపోవాల్సిందే. మన గాచారం బాగోలేక ఎక్కడైనా చిన్న రోడ్డు ప్రమాదం జరిగిందంటే, గంటలకొద్దీ రోడ్లపై బారులు తీరాల్సిందే. అత్యంత ఎక్కువ రద్దీ ఉండే నగరాల్లో దేశంలోనే బెంగళూరు టాప్ లో ఉంటుంది. ప్రపంచంలో బెంగళూరు ప్లేస్ ఏంటో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. బెంగళూరులో సగటు ప్రయాణం వేగం కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. అంటే 10 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే 29 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీ ఉన్న ప్రాంతాల్లో బెంగళూరుది రెండో స్థానం. డచ్ లోకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ సంస్థ అయిన టామ్ టామ్ ఈ వివరాలను వెల్లడించింది. ట్రాఫిక్ సూచిక ప్రకారం 2022లో సిటీ సెంటర్(బీబీఎంపీ ఏరియా) కేటగిరీలో బెంగళూరు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండో నగరంగా నిలిచింది. 

Also Read: Miss World 2023: మిస్ వరల్డ్ 2023 పోటీలు భారత్‌లోనే, 3 దశాబ్దాల తరవాత సర్‌ప్రైజ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Embed widget