Bengaluru Stampede : బెంగళూరు తొక్కిసలాట కేసులో కమిషనర్ నుంచి స్టేషన్ ఇంచార్జ్ వరకు సస్పెండ్ - అరెస్టుకు కర్ణాటక సీఎం ఆదేశాలు
Bengaluru Stampede :చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే బాధ్యులను సస్పెండ్ చేసి వారిని అరెస్టు చేయాలని DGP, IGP లకు ఆదేశించారు.

RCB Victory Parade Stampede RCB విజయోత్సవ పరేడ్ సమయంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన చర్యలు తీసుకున్నారు. పలువురు పోలీసు అధికారులతో పాటు క్రికెట్ స్టేడియం ఇన్‌ఛార్జ్‌పై కూడా వేటు వేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ, "కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హౌస్ మాస్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ACP, సెంట్రల్ డివిజన్ DCP, క్రికెట్ స్టేడియం ఇన్‌ఛార్జ్, అదనపు పోలీస్ కమిషనర్, పోలీస్ కమిషనర్లను తక్షణమే సస్పెండ్ చేశాం." అని తెలిపారు.
'తొక్కిసలాటకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలి'
సిద్ధరామయ్య ఇంకా మాట్లాడుతూ, "హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మైఖేల్ డికున్హా అధ్యక్షతన ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశాం. RCB, ఈవెంట్ మేనేజర్ DNA, KCSAలో బాధ్యులను అరెస్టు చేయాలని నిర్ణయించాము." అని అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, మంత్రివర్గ సమావేశంలో నిన్నటి ఘటనపై విస్తృతంగా చర్చించామని, 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరామని తెలిపారు. అలాగే, RCB ప్రతినిధి, KCSA ప్రతినిధిని వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర DG, IGP లకు ఆదేశించారు.
Bengaluru stampede | Karnataka CM Siddaramaiah says, "Cubbon Park Police Station Police Inspector, Station House Master, Station House Officer, ACP, Central Division DCP, Cricket Stadium in-charge, Additional Commissioner of Police, Commisioner of Police have been suspended with… pic.twitter.com/3U9YS8CLhm
— ANI (@ANI) June 5, 2025
CIDకి కేసు దర్యాప్తు
చిన్నస్వామి స్టేడియం ఎదుట జరిగిన తొక్కిసలాటపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) దర్యాప్తు చేస్తుందని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సమగ్రమైన, స్వతంత్ర దర్యాప్తు కోసం CID ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ని ఏర్పాటు చేస్తారు. భారతీయ న్యాయ స్మృతిలోని పలు సెక్షన్ల కింద కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో FIR (నేరం నంబర్ 123/2025) నమోదు చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది, ఇందులో సెక్షన్ 105, 125 (1) (2), 132, 121/1, 3 (5) లతోపాటు సెక్షన్ 190 కూడా ఉన్నాయి. ఈ కేసును ఇప్పుడు అధికారికంగా CIDకి అప్పగించామని, తదుపరి చర్యల కోసం SITని ఏర్పాటు చేయాలని ఆదేశించామని పేర్కొంది.
Bengaluru stampede | Karnataka CM Siddaramaiah says, "Under the chairmanship of Justice Michael D'Cunha, a retired judge of the High Court, we have appointed a one-man commission...On RCB, event manager DNA, KSCA, who represented them, we have taken a decision to arrest them." pic.twitter.com/bHSsn4iHCf
— ANI (@ANI) June 5, 2025
చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట కేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పై FIR నమోదు అయింది. ఘటన జరిగిన 24 గంటల తర్వాత పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. RCB, DNA (ఈవెంట్ మేనేజర్), కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేశారు. తొక్కిసలాట ఘటనలో నేరపూరిత నిర్లక్ష్యం ఉందని FIRలో పేర్కొన్నారు. FIRలో సెక్షన్లు 105, 125 (1) (2), 132, 121/1, 190 R/W 3 (5) విధించారు.





















