Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?
Karnataka Cabinet: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వరకు ముఖ్యమైన శాఖలు ఇచ్చారు.
Karnataka Cabinet: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ తర్వాత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా ఆయా మంత్రులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమైన ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు భారీ, మధ్య తరహా నీటి పారుదల శాఖతో పాటు బెంగలూరు సిటీ డెవలప్మెంట్ ను కేటాయించారు. హెచ్.కే పాటిల్ కి చట్టం, పార్లమెంటరీ వ్యవహారాలు, శాసనాలు, టూరిజాన్ని కేటాయించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమాన్ని దినేష్ గుండూరావుకు ఇచ్చారు. రెవెన్యూ(ముజ్రాయి మినహా) కృష్ణ బైరేగౌడకు కేటాయించారు. కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత జి.పరమేశ్వరకు హోం శాఖను అప్పగించారు. ఇంటెలిజెన్స్ ను మాత్రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన వద్దే ఉంచుకున్నారు.
మంత్రుల పోర్ట్ ఫోలియోల జాబితా..
సిద్ధరామయ్య(ముఖ్యమంత్రి) -ఆర్థిక, క్యాబినెట్ వ్యవహారాలు, వ్యక్తిగత & పరిపాలనా సంస్కరణలు, ఇంటెలిజెన్స్, సమాచారం, ఐటీ & బీటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సహా ఇతరులకు కేటాయించని శాఖలు
- డీకే శివకుమార్(ఉప ముఖ్యమంత్రి) - భారీ, మధ్య తరహా నీటిపారుదల శాఖ, బెంగళూరు పట్టణాభివృద్ధి, బీడీఐ, బీడబ్ల్ూఎస్ఎస్బీ, బీఎంఆర్డీఏ, బీఎంఆర్సీఎల్
- డా. జి పరమేశ్వర(కేబినెట్ మంత్రి) - హోంశాఖ (ఇంటెలిజెన్స్ మినహా)
- హెచ్.కే పాటిల్(కేబినెట్ మంత్రి) - చట్టం, పార్లమెంట్ వ్యవహారాలు, శాసనం, పర్యాటకం
- హెచ్.కే. మునియప్ప(కేబినెట్ మంత్రి) - ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
- రామలింగా రెడ్డి (కేబినెట్ మంత్రి) - రవాణా, ముజ్రాయ్
- ఎం.బి పాటిల్ (కేబినెట్ మంత్రి) - భారీ, మధ్య తరహా పరిశ్రమలు
- కేజీ జార్జ్ (కేబినెట్ మంత్రి) - ఇంధనం
- దినేష్ గుండూరావు (కేబినెట్ మంత్రి) - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
- హెచ్.సి మహదేవప్ప (కేబినెట్ మంత్రి) - సాంఘిక సంక్షేమం
- సతీష్ జార్కిహల్లి (కేబినెట్ మంత్రి) - పబ్లిక్ వర్క్స్
- కృష్ణ బైరేగౌడ (కేబినెట్ మంత్రి) - రెవెన్యూ (ముజ్రాయ్ మినహా)
- ప్రియాంక్ ఖర్గే (కేబినెట్ మంత్రి) - గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్
- శివానంద్ పాటిల్ (కేబినెట్ మంత్రి) - టెక్స్‌టైల్స్, చెరకు అభివృద్ధి, చక్కెర డైరెక్టరేట్
- బి.జి జమీర్ అహ్మద్ ఖాన్ (క్యాబినెట్ మంత్రి) - హౌసింగ్, వక్ఫ్, మైనారిటీ సంక్షేమం
- శరణబసప్ప దర్శనపూర్ (కేబినెట్ మంత్రి) - చిన్న తరహా పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్
- ఈశ్వర్ ఖండ్రే (కేబినెట్ మంత్రి) - అటవీ, జీవావరణ శాస్త్రం, పర్యావరణం
- ఎన్. చెలువర్యస్వామి (కేబినెట్ మంత్రి) - వ్యవసాయం
- ఎస్.ఎస్ మల్లికార్జున (క్యాబినెట్ మంత్రి) - మైనింగ్ మరియు జియాలజీ, హార్టికల్చర్
- రహీమ్ ఖాన్ (కేబినెట్ మంత్రి) - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హజ్
- సంతోష్ ఎస్ లాడ్ (కేబినెట్ మంత్రి) - కార్మిక
- శరణ్‌ప్రకాష్ రుద్రప్ప పాటిల్ (కేబినెట్ మంత్రి) - వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి
- తిమ్మాపూర్ రామప్ప బాలప్ప (కేబినెట్ మంత్రి) - ఎక్సైజ్
- కె వెంకటేష్ (క్యాబినెట్ మంత్రి) - పశు సంవర్ధక, సెరికల్చర్
- తంగడగి శివరాజ్ సంగప్ప (కేబినెట్ మంత్రి) - వెనుకబడిన తరగతులు, సంస్కృతి
- డి. సుధాకర్ (కేబినెట్ మంత్రి) - ప్రణాళిక, గణాంకాలు
- బి. నాగేంద్ర (క్యాబినెట్ మంత్రి) – యువజన సేవ, క్రీడలు, షెడ్యూల్డ్ తెగ సంక్షేమం
- కీతసంద్ర ఎన్. రాజన్న (కేబినెట్ మంత్రి) – సహకారం, వ్యవసాయ మార్కెటింగ్
- సురేష్ బి.ఎస్ (క్యాబినెట్ మంత్రి) - అర్బన్ డెవలప్‌మెంట్, టౌన్ ప్లానింగ్ (బెంగళూరు నగర అభివృద్ధిని కలిగి ఉండదు)
- లక్ష్మీ ఆర్ హెబ్బాల్కర్ (క్యాబినెట్ మంత్రి) - స్త్రీ, శిశు సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సాధికారత
- మనకాల్ వైద్య (క్యాబినెట్ మంత్రి) - రాష్ట్రంలో మత్స్య, ఓడరేవులు, రవాణా
- మధు బంగారప్ప (కేబినెట్ మంత్రి) - ప్రాథమిక, మాధ్యమిక విద్య
- ఎంసీ సుధాకర్ (కేబినెట్ మంత్రి) - ఉన్నత విద్య
- ఎన్ఎస్ బోసరాజు (క్యాబినెట్ మంత్రి) - చిన్న నీటిపారుదల, సైన్స్ అండ్ టెక్నాలజీ