Karnataka BJP MLA : అధికారం నెత్తికెక్కిన ఎమ్మెల్యే అచ్చంగా ఇలాగే ఉంటారు - ఈ కర్ణాటక బీజేపీ నేత ఏం చేశారో చూడండి !
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే లింబావలి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన మహిళతో దురుసుగా ప్రవర్తించారు. ఆమెను పోలీసులకు అప్పగించారు.
Karnataka BJP MLA : సమస్యను పరిష్కరించాలని ఓ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన మహిళపై దౌర్జన్యం చేశారు కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే. బెంగళూరు నగరంలోలో భాగంగా ఉన్న మహదేవపుర నియోజవర్గానికి అరవింద్ లింబావలి ఎమ్మెల్యేగా ఉన్ారు. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఓ మహిళ వినతి పత్రంతో అక్కడకు వచ్చారు. అయితే ఆ మహిళతో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. వినతి పత్రం తీసుకుని చించేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH |Karnataka BJP MLA Aravind Limbavali verbally abused a woman&misbehaved when she tried to hand over a complaint letter to him&speak to him regarding issues in Varthur, Bengaluru following heavy rainfall
— ANI (@ANI) September 3, 2022
She was later taken to Police Station (02.9)
(Note:Abusive language) pic.twitter.com/9QL51UDL5d
ఎమ్మెల్యే అంతటితో వదిలి పెట్టలేదు. వైట్ ఫీల్డ్ పోలీసులను పిలిచి ఆ మహిళపై కేసు పెట్టాలని ఆదేశించారు. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పోలీసులు చెప్పినట్లే చేశారు. ఆమెపై కేసు పెట్టి స్టేషన్ కు తీసుకెళ్లారు.
At 3 pm MLA Limbavali came to our place & abused my husband & asked Police to take him away. Then my husband called me. I went to speak to MLA but his PA&supporters stopped me. He asked his supporters to attack me. Now FIR filed against my husband,son & me: Ruth Sagai Mary Ameela pic.twitter.com/zONRGr5wm0
— ANI (@ANI) September 3, 2022
అ మహిళ తన ఇంటి గోడను అక్రమంగా కూల్చేశారని.. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరురాలు కావడంతో ఎమ్మెల్యే ఇలా చేసినట్లుగా తెలుస్తోంది.
Police didn't take our complaint for 5 hrs, they made us sit in the station for 5 hrs...I'll fight it legally, I'm a social worker & Congress member. My party came in support of me later: Ruth Sagai Mary Ameela who was seen being verbally abused by K'tka BJP MLA Aravind Limbavali pic.twitter.com/3XtfBcVLjU
— ANI (@ANI) September 3, 2022
లింబావలి ప్రవర్తన తరచూ వివాదాస్పదమవుతూ ఉంటుంది. ఆయన కుమార్తె కూడా ఇటీవల ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తూ పట్టుబడి పోలీసులతో దుందుడుకుగా వ్యవహరించారు. అప్పుడు లింబావిర క్షమాపణ చెప్పారు. ఇప్పుడు తానే దురుసుగా వ్యవహరించారు.