అన్వేషించండి

Hemant Soren: రాంచీలో సీఎం హేమంత్ సోరెన్ ప్రత్యక్షం - ఎమ్మెల్యేలతో కీలక భేటీ, ఆయన సతీమణికి సీఎం పగ్గాలు?

Jharkhand CM: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఆయన రాంచీలో ప్రత్యక్షమై పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కావడంతో నాయకత్వ మార్పు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Jharkhand CM Hemant Soren Who Has Left His Anonymity: భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన రాంచీలో (Ranchi) ప్రత్యక్షమయ్యారు. తన అధికారిక నివాసంలో మంత్రులు, జేఎంఎం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆయన సతీమణి కల్పన కూడా హాజరు కావడంతో నాయకత్వం మారొచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో సోరెన్ నివాసంతో పాటు రాజ్ భవన్, ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.

భార్యకు పగ్గాలు?

ఓవైపు ఈడీ విచారణ, మరోవైపు సీఎం అందుబాటులో లేకపోవడంతో ఝార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర నాయకత్వ మార్పు తప్పదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో తాజాగా సోరెన్ అజ్ఞాతం వీడారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా - జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో భేటీ కావడం, ఈ సమావేశంలో సోరెన్ భార్య కల్పన కూడా పాల్గొనడం ఆ ఊహాగానాలకు బలం చేకూరింది. సతీమణికి సీఎం సోరెన్ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

కార్లు, రూ.36 లక్షలు స్వాధీనం

భూకుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. 13 గంటలు ఎదురుచూసినా సోరెన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. అయితే, సీఎం నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు 2 బీఎండబ్ల్యూ కార్లు, పలు కీలక దస్త్రాలు, రూ.36 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి వరకూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 31న (బుధవారం) రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్ ఇప్పటికే ఈడీ అధికారులకు సందేశం పంపారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన్ను ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈడీ అధికారులు విచారించేందుకు వెళ్లిన సమయంలో సోరెన్ అందుబాటులో లేకపోవడంతో 'సీఎం మిస్సింగ్' అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. సోరెన్ చిత్రంతో ఉన్న పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి, ఆయన గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.11 వేల రివార్డు ప్రకటించింది. 

గవర్నర్ ఏమన్నారంటే.?

కాగా, ఝార్ఖండ్ లో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్పందించారు. అందరిలాగే తాను కూడా సీఎం సోరెన్ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 'చట్టానికి ఎవరూ అతీతులు కాదు. రాజ్యాంగ పరిధిలోనే మనం పని చేయాలి. రాజకీయ విభేదాలతో నాకు సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు.' అని పేర్కొన్నారు.

Also Read: Death Sentence: బీజేపీ నేత హత్య కేసు - 15 మందికి మరణ శిక్ష, కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
ICC Champions Trophy: ప్రమాదంలో రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు వీరిద్దరిని తప్పించే చాన్స్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనుగడ కష్టమే..! 
ప్రమాదంలో రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు వీరిద్దరిని తప్పించే చాన్స్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనుగడ కష్టమే..! 
Mahakumbh 2025 : రైల్లో కుంభమేళాకు వెళ్తున్నారా - ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌పై ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ కీలక ప్రకటన
రైల్లో కుంభమేళాకు వెళ్తున్నారా - ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌పై ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ కీలక ప్రకటన
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Embed widget