J&K: బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు- కశ్మీరీ పండిట్ల సంచలన నిర్ణయం
J&K: జమ్ముకశ్మీర్‌లో ఓ బ్యాంక్ మేనేజర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
J&K: వరుస దాడులతో జమ్ముకశ్మీర్ అట్టుడుకుతోంది. ముఖ్యంగా కశ్మీరీ పండిట్లను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఒక వార్త మరువకముందే మరొకర్ని బలి తీసుకుంటున్నారు. తాజాగా ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. కుల్గామ్ జిల్లా మోహన్పొరాలో బ్యాంకు మేనేజర్ విజయ్‌కుమార్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన విజయ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు.
#WATCH | J&K: Terrorist fires at bank manager at Ellaqie Dehati Bank at Areh Mohanpora in Kulgam district.
— ANI (@ANI) June 2, 2022
The bank manager later succumbed to his injuries.
(CCTV visuals) pic.twitter.com/uIxVS29KVI
రెండు రోజుల్లో రెండు
కశ్మీర్‌లోని మోహన్పొరాలో ఉన్న ఇలాఖీ దేహతి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌గా విజయ్‌కుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు గురువారం బ్యాంకులోనే ఆయన్ను కాల్చి చంపారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
J&K | Security forces outside Ellaqie Dehati Bank at Areh Mohanpora in Kulgam district where bank manager was shot dead by terrorists. Search operation underway.
— ANI (@ANI) June 2, 2022
(Visuals deferred by unspecified time) pic.twitter.com/xC4sG1acnn
రెండు రోజుల క్రితమే ఓ టీచర్‌ను కాల్చిచంపారు ముష్కరులు. అంతకుముందు జమ్ముకశ్మీర్‌లో టీవీ నటిని బలి తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకు మేనేజర్‌పై దాడి చేయడంతో కశ్మీరీ పండిట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కీలక నిర్ణయం
వరుస దాడులతో కశ్మీరీ పండిట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రాణ భయం కారణంగా కశ్మీర్ లోయను విడిచి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుస ఉగ్రదాడులతో పండిట్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కశ్మీర్ లోయ నుంచి జమ్ము వెళ్లిపోతున్నట్లు పండిట్లు ప్రకటించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పండిట్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Sonia Gandhi Corona Positive: ఈడీ విచారణ వేళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్
Also Read: Bangaldeshi Woman: ప్రేమ కోసం బంగ్లాదేశ్ యువతి సాహసం- అడవులు దాటి, సముద్రాన్ని ఈది భారత్‌కు!