(Source: ECI/ABP News/ABP Majha)
ITBP Bus Accident: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం
ఆర్మీ బస్సు బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. 32 మంది జవాన్లకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
జమ్మూకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పహల్ఘం వద్ద ఆర్మీ బస్సు బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. 32 మంది జవాన్లకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఉదయం 11 గంటలకు జరిగింది.
జమ్మూ కశ్మీర్‌లో అనంత్‌నాగ్‌లోని చందన్‌వాడి సమీపంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో 6 మంది ఐటీబీపీ సిబ్బంది మరణించగా, 37 మంది గాయపడినట్లు సమాచారం. అమర్‌నాథ్ యాత్రలో ఐటీబీపీ సిబ్బందిని మోహరించారు.
పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం
బస్సులో 39 మంది సైనికులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఐటీబీపీకి చెందిన 37 మంది సిబ్బంది, జమ్మూ కశ్మీర్ పోలీస్ కు చెందిన ఇద్దరు సిబ్బంది ఉన్నారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి లోతట్టు ప్రాంతానికి దూసుకుపోయిందని, అలా లోయలో పడిపోయినట్లు సమాచారం. జవాన్లందరూ చందన్‌వాడి నుంచి పహల్గామ్ వైపు వెళ్తున్నారు. అమర్‌నాథ్ యాత్ర డ్యూటీ నుంచి జవాన్లందరూ తిరిగి వస్తున్నారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో జవాన్లు గాయపడే అవకాశం ఉంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
#WATCH Bus carrying 37 ITBP personnel and two J&K Police personnel falls into riverbed in Pahalgam after its brakes reportedly failed, casualties feared#JammuAndKashmir pic.twitter.com/r66lQztfKu
— ANI (@ANI) August 16, 2022
రాష్ట్రపతి సంతాపం
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) చనిపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. అనంత్ నాగ్‌లో జరిగిన ఘటన తనను కలచివేసిందని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ద్రౌపది ముర్ము ప్రార్థించారు.
షానవాజ్ హుస్సేన్ సంతాపం
ఈ ఘటనపై బీహార్ మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం అని ఆయన ట్వీట్ చేశారు. అమర్‌నాథ్ యాత్రలో నిమగ్నమైన ఐటీబీపీ బస్సు పడిపోవడంతో పలువురు జవాన్లు వీరమరణం పొందడం, గాయపడిన వార్త తనకు చాలా బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం
ఈ ప్రమాదంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చందన్‌వాడి దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మన వీర ITBP జవాన్లను కోల్పోయినందుకు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.
మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం
అదే సమయంలో, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా సైనికుల అమరవీరులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘దక్షిణ కశ్మీర్ నుండి ఈ రోజు చాలా విచారకరమైన వార్త అందింది. పహల్గామ్‌లో జరిగిన ప్రమాదంలో వీరమరణం పొందిన వీర ITBP జవాన్ల కుటుంబాలకు మరియు సహోద్యోగులకు సంతాపం తెలియజేస్తున్నాను. చాలా మంది ITBP జవాన్లు గాయపడ్డారు. వారికి నేను సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.