తమిళనాడులో ఇషా ఆధ్వర్యంలో బిగ్ ప్లాంటేషన్ డ్రైవ్- 2023లో 1.1 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
కావేరి కాలింగ్ ఉద్యమంలో భాగంగా 2022లో ఇషా ఫౌండేషన్ అద్భుతమైన ఫీట్‌ను సాధించింది. రైతులతో కోటి మొక్కలు నాటించి అరుదైన మైలురాయిని సాధించింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తమిళనాడు, కర్నాటక అంతటా ప్లాంటేషన్, క్లీనెస్ డ్రైవ్‌ను ఇషా ప్రారంభించింది. కావేరి నదిని పునరుజ్జీవింపజేసేందుకు కావేరి కాలింగ్ పేరుతో ఉద్యమం చేపట్టింది. అందులో భాగంగా చెట్ల ఆధారిత వ్యవసాయాన్ని చేపట్టేలా రైతులను ప్రోత్సహించింది. ఫలితంగా రైతుల ఆదాయాన్ని పెంచడం కూడా ఈ ప్లాంటేషన్ డ్రైవ్ లక్ష్యం.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, సద్గురు ఒక సందేశంలో ఇలా చెప్పారు. “‘యూజ్ అండ్ త్రో’ మనస్తత్వానికి ముగింపు పలకడం అంటే కాలుష్యాన్ని తగ్గించడం మాత్రమే కాదు. ఇది సమస్త సృష్టిని గౌరవించడం. ప్రతిదీ భూమి నుంచి వస్తుంది. మనం దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించుకుందాం." అని వివరించారు. ఆ వీడియో సందేశాన్ని ఇక్కడ చూడొచ్చు.
View this post on Instagram
కావేరి కాలింగ్ ఉద్యమంలో భాగంగా తమిళనాడులో ఈ సంవత్సరం రైతులతో తమ పొలాల్లో 1.1 కోట్ల మొక్కలు నాటించే లక్ష్యంతో చెట్ల పెంపకం డ్రైవ్‌ను విజయవంతంగా ప్రారంభించింది. గతేడాది కావేరి కాలింగ్ ఉద్యమంలో భాగంగా తమిళనాడులో కోటి మొక్కలు నాటే మైలురాయిని సాధించిందీ ఇషా సంస్థ.
తమిళనాడు, పాండిచ్చేరిలోని అన్ని జిల్లాల్లోని 140 రైతు భూముల్లో ఒక రోజులో 1.6 లక్షల మొక్కలు నాటడం ద్వారా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ఉద్యమంలో టేకు, ఎర్రచందనం, మర్రి, వేప, మహోగని, రోజ్‌వుడ్ వంటి విలువైన చెట్లు నాటడానికి రైతులకు వీలు కల్పిస్తోంది. ఇది వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. కావేరి నదిని పునరుజ్జీవింపజేయడంలో కూడా కీలకమైనదీ కార్యక్రమం. ఈ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, ఇతర ప్రముఖులు హాజరైన ప్రజాప్రతినిధులు ఉద్యమానికి తమ మద్దతును తెలిపారు.
కోయంబత్తూరులోని పొల్లాచ్చి పట్టణంలో ఎంపీ కే షణ్ముగసుందరం "ప్లాస్టిక్ ఫ్రీ నోయల్ రివర్" డ్రైవ్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా కోయంబత్తూరు, తిరుపూర్ సహా నాలుగు జిల్లాలకు ప్రధాన నీటి వనరు అయిన నోయల్ నదిని పునరుజ్జీవింపజేసేందుకు తమిళనాడు ప్రభుత్వంతో ఇషా చేతులు కలిపింది. దీని ప్రకారం నొయల్ నదిలోని మొదటి 4 కి.మీ వరకు చెత్తను తొలగించే బాధ్యతను ఇషాకు అప్పగించారు. ఇషా సంస్కృతి, ఇషా హోమ్ స్కూల్‌లోని ఔత్సాహిక విద్యార్థులు నదిని శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల అంకితభావానికి మురిసిపోయిన మంత్రి, పర్యావరణ పరిరక్షణలో వారు చేస్తున్న కృషిని అభినందించారు. ఆ వీడియోను ఇక్కడ చూడవచ్చు.
View this post on Instagram
ప్రపంచ పర్యావరణ దినోత్సవ స్ఫూర్తిని పురస్కరించుకుని, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు పరిశుభ్రత డ్రైవ్ కోసం సేవ్ సాయిల్ వాలంటీర్లు చెన్నైలోని మెరీనా బీచ్‌లో సమావేశమయ్యారు. స్వచ్ఛంద సేవకులు సహజమైన సముద్ర పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. వారి కృషిని ఈ వీడియోలో చూడవచ్చు.
View this post on Instagram
సద్గురు నేతృత్వంలోని సేవ్ సాయిల్ ఉద్యమం పౌరుల మద్దతును మరింత ప్రోత్సహిస్తోంది. ప్రపంచంలోని భూప్రాంత క్షీణతను పరిష్కరించే విధానాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను ప్రోత్సహిస్తోంది. ప్రపంచంలోని 52% వ్యవసాయ భూమి ఇప్పటికే క్షీణించింది. వ్యవసాయ భమూి ప్రాంతీయ పరిస్థితుల ఆధారంగా కనీసం 3-6% సేంద్రీయ పదార్థం (SOM) కలిగి ఉండాలని సేవ్ సాయిల్ ఉద్యమం సిఫార్సు చేసింది.
కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన చిక్కబళ్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బెంగళూరులోని సద్గురు సన్నిధిలో ఆదియోగి దగ్గర మొక్క నాటారు. ఇషా “గ్రీన్ చిక్కబళ్లాపూర్” చెట్ల పెంపకం కార్యక్రమంలో భాగంగా 2023లో జిల్లాలో 10,000 మొక్కలు నాటడం ప్రారంభించింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇషా చేపట్టిన కార్యక్రమాలకు తాను గర్వపడుతున్నానని, అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తాను మద్దతునిస్తానని హామీ ఇచ్చారు. సేవ్ సాయిల్ వాలంటీర్లు, స్థానిక గ్రామస్తులు సద్గురు సన్నిధిలో మొక్కలు నాటుతూ రోజంతా గడిపారు. ఆ వీడియోలను ఇక్కడ చూడవచ్చు
View this post on Instagram
View this post on Instagram
ఇషా నిర్వహించిన సర్వేలో డిమాండ్ ప్రాతిపదికన ప్రతి రైతుకు ఐదు పండ్ల మొక్కలను ఉచితంగా అందించి చిక్కబళ్లాపూర్‌లోని తిప్పేనహళ్లి అవలగుర్కి గ్రామాల్లో చెట్ల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కలు స్వీకరించారు.
2020 నుంచి కర్ణాటక ప్రభుత్వం 9 కావేరి నదీ పరీవాహక జిల్లాల్లోని 41,000 మంది రైతులకు 24 మిలియన్ల మొక్కలను పంపిణీ చేసింది. కావేరి కాలింగ్ బృందం కర్ణాటక ప్రభుత్వంతో కలిసి 1,800 కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, రైతు హెల్ప్‌లైన్, వాట్సాప్ గ్రూపుల ద్వారా 51,500 మంది రైతులకు మద్దతుగా పని చేస్తోంది.