అన్వేషించండి

Fact Check: ఎలక్ట్రిక్ డివైస్‌ ఉపయోగించి ఫాస్టాగ్‌ నుంచి డబ్బులు కొట్టేయొచ్చా?

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ కుర్రాడి వీడియో వైరల్‌గా మారింది. ఫాస్ట్‌ట్యాగ్‌ను స్కాన్ చేసి డబ్బులు తీసుకుంటున్నారని దాని సారాంశం.

Fastag Scam Fact Check: ఫాస్టాగ్‌ స్కామ్ అంటూ ఈ మధ్య కాలంలో ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ పడిన వెంటనే కొంత మంది వచ్చి కారు అద్దారు తుడుస్తూ ఈ ఫాస్టాగ్‌లోని డబ్బులు కొట్టేస్తున్నారని ఆ వీడియోలో చూపించారు. ముఖ్యంగా పేటీఎంతో లింక్ అయి ఉన్న అకౌంట్స్‌కు ఈ సమస్య ఉందని హెచ్చరించారా వీడియోలో. 

ఆ వీడియోలో ఇంకా ఏముంది అంటే..
వాట్సాప్‌తోపాటు ఇతర సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ బాలుడు కారు అద్దాలు తుడుస్తూ ఉంటాడు. కారులోపల కూర్చొని ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ వీడియోనూ రికార్డ్ చేస్తారు. ఆ బాలుడు కూడా తన చేతికి ఓ స్మార్ట్ వాచ్‌ను కట్టుకొని ఉంటాడు. అద్దాలు తుడుస్తూనే.. కారులో ఉన్న ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ను స్కాన్ చేస్తాడు. 

ఇలా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అద్దాలు క్లీన్ చేసే వాళ్లు తమ పని పూర్తైన తర్వాత డబ్బులు అడుగుతారు. కానీ ఆ వీడియోలో బాలుడు మాత్రం డబ్బులు అడక్కుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బాలుడు డబ్బులు అడక్కపోయేసరికి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తికి డౌట్ వస్తుంది. ఎందుకు ఆ పిల్లాడు డబ్బులు అడగుకుండానే వెళ్లిపోయాడని పక్కనే కూర్చొని ఉన్న తన స్నేహితుడిని అడుగుతాడు. ఆ పిల్లాడు తన చేతికి స్మార్ట్ వాచ్‌ కట్టుకొని ఉన్నాడని... గుర్తించిన ఆ కారులోని వ్యక్తి పిల్లాడని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. వాళ్లు వస్తున్న సంగతి గుర్తించిన ఆ పిల్లాడు అక్కడి నుంచి వాళ్లకు దొరక్కుండా పరిగెత్తివెళ్లిపోతాడు. 

తర్వాత కారులోకి వచ్చి కూర్చున్న డ్రైవర్‌ ఫ్రెండ్‌ ఈ మోసం ఎలా జరుగుతుందో వివరిస్తాడు. అద్దాలు క్లీన్ చేస్తున్నట్టు ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ను స్కాన్ చేస్తారని... తర్వాత పేటీఎం వాలెట్‌ నుంచి చెల్లింపులు చేసే వారి ఖాతాల నుంచి డబ్బులు తీసుకుంటారని వివరిస్తాడు.

ఇది కాస్త వైరల్ అవ్వడంతో ఫాస్టాగ్‌ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి స్కామ్‌లు జరగడానికి అవకాశమే లేదని తేల్చి చెప్పింది. ఇది టోల్‌ప్లాజా, పార్కింగ్ ప్లాజా వాళ్లు మాత్రమే ఇందులో డబ్బులు డ్రా చేసుకునే వీలుందని వేరే వాళ్లకు ఇది సాధ్యమయ్యే పని కాదని చెప్పింది. వేరే డివైస్‌ల ద్వారా ఫాస్టాగ్స్‌ స్టిక్కర్స్ నుంచి డబ్బులు వీలుపడదని... ఇది వందకు వందశాతం సురక్షితమని ట్వీట్ చేసింది.   

కేంద్ర సమాచార శాఖ కూడా దీనిపై రియాక్ట్ అయింది. ఇది ఫేక్ స్కామ్‌ అని చెప్పుకొచ్చింది. ప్రతి టోల్‌ప్లాజాకు ఓ ప్రత్యేకమైన కోడ్ ఉంటుందని... దాన్ని ఓ బ్యాంక్‌కు లింక్ చేసి ఉంటుందన్నారు. దానికి జియో కోడ్ కూడా ఉంటుదని వివరించారు. 

అందుకే ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు. ఇలాంటివి ఫార్వర్డ్ చేసినా... షేర్ చేసినా మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. 
సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో పూర్తిగా  కల్పితమైంది. అలాంటి లావాదేవీలు జరిపేందుకు వీలుండదు. 

టాప్ హెడ్ లైన్స్

PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో రూ.2 వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. రూ.2 వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
కుంభమేళా 2027: నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ పర్వం పూర్తి షెడ్యూల్, అమృతస్నానాల ప్రాముఖ్యత!
కుంభమేళా 2027: నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ పర్వం పూర్తి షెడ్యూల్, అమృతస్నానాల ప్రాముఖ్యత!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
Bigg Boss Season 10 Today October 30th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
Income Tax Raids: ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
Embed widget