అన్వేషించండి

Violence In Manipur: మణిపూర్​లో మళ్లీ చెలరేగిన హింస.. కర్ఫ్యూ, ఇంటర్నెట్​ సేవల నిలిపివేత

మణిపూర్​లో హింస మళ్లీ మొదలైంది. దీంతో ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. ఐదు రోజుల పాటు కీలక లోయ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ తోపాటు డేటా సేవలను నిలిపివేసింది.

Violence Breaks Out In Manipur: మణిపూర్​లో హింస మళ్లీ మొదలైంది. ఇంఫాల్ లోయ ప్రాంతంలో హింసాత్మక నిరసనలతోపాటు భద్రతా సిబ్బందితో నిరసనకారులు ఘర్షణలకు దిగినట్లు సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు పలు నిబంధనలు విధించారు. ఐదు రోజుల పాటు కీలక లోయ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ తోపాటు డేటా సేవలను నిలిపివేశారు. ఘర్షణలు ఎక్కువగా చెలరేగుతున్న బిష్ణుపూర్‌లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. తూర్పు ఇంఫాల్, పశ్చిమ ఇంఫాల్, తౌబాల్ తోపాటు కాచింగ్ జిల్లాల్లో 144 సెక్షన్ పెట్టి పలు నిషేధాజ్ఞలు విధించింది. ఈ విషయాన్ని మణిపూర్ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా శనివారం అర్ధరాత్రి తెలియజేశారు. ఈ నిషేధాజ్ఞలు వెంటనే అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. 

ప్రజా ప్రశాంతతను కాపాడుకోవడానికి సస్పెన్షన్ అవసరమైన చర్య
సోషల్​ మీడియా ద్వారా ద్వేషపూరిత ప్రసంగం, వీడియోలతో సహా రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రసారం చేసే అవకాశం ఉందని, అందుకే ‘సామాజిక వ్యతిరేక అంశాలు’ ప్రజల్లోకి వెళ్లకుండా ఇంటర్నెట్​ సేవలను బంద్​ చేసినట్లు రాష్ట్ర కమిషనర్, హోం కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సామాజిక వ్యతిరేక అంశాలు అశాంతికి దారితీస్తుంది వెల్లడించారు. ‘ప్రాణనష్టం లేదా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తికి నష్టాన్ని నివారించడానికి, మతసామరస్యం, ప్రజా ప్రశాంతతను కాపాడుకోవడానికి సస్పెన్షన్ అవసరమైన చర్య’ అని ఆ ఉత్తర్వులో పేర్కొంది.

పోలీస్​ అవుట్‌పోస్ట్​పై సామూహిక దాడి
మెయిటీ గ్రూపు అరంబై టెంగోల్‌కు చెందిన ఐదుగురు సభ్యులతోపాటు దాని కమాండర్లలో ఒకరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వ్యాపించిన నేపథ్యంలో మహిపూర్​లో మళ్లీ హింస చెలరేగింది. ప్రతీకారంగా ఆందోళనకారులు ఓ పోలీస్ ఔట్​పోస్ట్​లో దాడి చేశారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. దీంతో జనసమూహాన్ని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు అనేక రౌండ్లు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో అక్కడి పరిస్థితులను కవర్​ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులతో సహా మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

తప్పుడు వార్తలను వ్యాప్తి చేయొద్దు
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో  సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు, పారామిలిటరీ దళాలను ప్రభుత్వం మోహరించింది. ప్రజలు బయటకు రావొద్దని,  ఇంటి లోపలే ఉండాలని వెల్లడించారు. తప్పుడు వార్తను వ్యాప్తి చేయకుండా ఉండాలని, సంయమనం పాటించాలని  ప్రభుత్వం కోరింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో బొలెరో బీభత్సం- ముగ్గురు మహిళలు మృతి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో బొలెరో బీభత్సం- ముగ్గురు మహిళలు మృతి
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Scindia Royal Family Property Dispute Settlement: 40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Rajesh Sharma Hospitalised: ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
Embed widget