అన్వేషించండి

లక్నోలో మ్యాచ్ పెట్టుంటే ఇండియా గెలిచేది, మోదీ స్టేడియం పిచ్‌లో ఏదో తేడా ఉంది - అఖిలేశ్ యాదవ్

World Cup Final Match: వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ని లక్నోలో పెట్టి ఉంటే ఇండియా గెలిచి ఉండేదని అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

World Cup Final Match News:

లఖ్‌నవూలో పెట్టుంటే గెలిచేది..

వరల్డ్‌ కప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవన్నీ అడియాసలే అయ్యాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి వరల్డ్‌ కప్‌ని దక్కించుకుంది. ఇదంతా జరిగిపోయి నాలుగు రోజులవుతున్నా ఇంకా క్రికెట్ ఫ్యాన్స్‌ దీన్ని మర్చిపోవడం లేదు. కప్ గెలవలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ODI World Cup 2023 ఫైనల్ మ్యాచ్‌ని గుజరాత్‌లో కాకుండా లఖ్‌నవూలో పెట్టుంటే కచ్చితంగా ఇండియా గెలిచేదని అన్నారు. వరల్డ్‌ కప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి టాప్‌లో ఉన్న భారత్ ఫైనల్‌లో మాత్రం చతికిలబడిపోయింది. ఈ మ్యాచ్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. దీనిపై ఇప్పటికే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

"World Cup 2023 final మ్యాచ్‌ని గుజరాత్‌లో పెట్టారు. అలా కాకుండా లఖ్‌నవూలో పెట్టి ఉంటే టీమిండియా కచ్చితంగా గెలిచేది. ఇండియన్ టీమ్‌కి చాలా మంది ఆశీర్వాదాలు లభించేవి. ఆ విష్ణుమూర్తితో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆశీర్వాదాలతో ఇండియా తప్పకుండా గెలిచి ఉండేది. నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌లో ఏదో లోపం ఉన్నట్టుగా తెలుస్తోంది"

- అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్

మ్యాచ్‌ ఇలా జరిగింది..

మ్యాచ్‌ విషయానికొస్తే...50 ఓవర్లలో భారత్ 240 పరుగులు చేసింది. మొదటి నుంచి ఆస్ట్రేలియన్ బౌలర్‌లు కట్టడి చేస్తూ వచ్చారు. బౌండరీస్‌ పోకుండా చాలా కట్టుదిట్టంగా ఫీల్డింగ్ చేశారు. ఇంత టఫ్‌ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ 31 బాల్స్‌లో 47 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఆ తరవాత విరాట్ కోహ్లీ కొంత వరకూ స్కోర్‌ బోర్డ్‌ని పరుగులు పెట్టించాడు. 63 బాల్స్‌కి 54 పరుగులు చేసి పెవీలియన్ చేరాడు. ఆ తరవాత క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ 66 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వేగంగా మూడు వికెట్‌లు కోల్పోయింది. కప్‌ భారత్‌దే అనుకుంటున్న సమయంలో ట్రావిస్ హెడ్‌ క్రీజ్‌లో నిలబడ్డాడు. 120 బాల్స్‌లో 137 పరుగులు చేసి ఒక్కసారిగా మ్యాచ్‌ని ఆస్ట్రేలియా వైపు తిప్పేశాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ని గెలిపించాడు. ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. భారతీయులంతా ఒక్కసారిగా నిట్టూర్చారు. 

గంభీర్ కామెంట్స్..

వరల్డ్ కప్‌లో అత్యత్తమ జట్టే విజయం సాధించిందని అన్నారు గౌతమ్ గంభీర్. ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ఒత్తడిని తట్టుకొని కప్‌ గెలుకుచున్న వాళ్లే విజేతలని అదే ఉత్తమ జట్టని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... "నా వాదన చాలా మందికి నచ్చకపోవచ్చు. ఉత్తమమైన జట్టు వరల్డ్‌కప్‌ గెలవలేదన్న అభిప్రాయంతో ఏకీభవించలేను. ఆ వాదన చాలా వింతగా ఉంది. గొప్పగా ఆడిన జట్టే వరల్డ్ కప్‌లో విజయం సాధించిది. భారత్‌ పది మ్యాచ్‌లు విజయం సాధించింది కానీ ఆఖరి మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగింది. ఆస్ట్రేలియా మాత్రం మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత మరింత పరిశ్రమతో కప్‌ గెలుచుకుంది. వరుసగా గెలిచిన మ్యాచ్‌లతోనే ఉత్తమ జట్టును డిసైడ్ చేయలేరు. లీగ్ దశలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు. కప్ ఎవరు గెలుచుకున్నారనేది గుర్తించాలని గంభీర్ సూచించారు. 

Also Read: Uttarakhand Tunnel Rescue: కూలిన సొరంగం పక్కనే బ్యాకప్‌ టన్నెల్, త్వరలోనే కార్మికులకు విడుదల!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Embed widget