X

Corona Updates: ఇండియాలో 543 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు.. ఆందోళన పెంచుతున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్

కరోనా వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో తాజాగా దక్షిణాఫ్రికా నుంచి ఒమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రమాదకరమైన వేరియంట్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

FOLLOW US: 

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి 543 రోజుల కనిష్టానికి దిగొచ్చింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,744 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించగా, అదే సమయంలో మరో 621 మందిని కొవిడ్ మహమ్మారి బలిగొంది. నిన్న ఒక్కరోజులో 9,481 మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు.

దేశంలో మొత్తం కరోనా రికవరీ కేసుల సంఖ్య 339,98,278 కు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ ‌లో మొత్తం కరోనా మరణాలు 4,68,554కు చేరుకున్నాయి. మొత్తం కేసులలో కరోనా మరణాల రేటు 1.36 శాతంగా ఉండగా, కొవిడ్19 బాధితుల రికవరీ రేటు 98.34 అయిందని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 1,05,691 యాక్టివ్ కరోనా కేసులుండగా.. ఇది 543 రోజులలో కనిష్టం కావడం విశేషం. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో తాజాగా దక్షిణాఫ్రికా నుంచి ఒమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొత్త వేరియంట్ డేల్టా కంటే ప్రమాదకరమైనదని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. 
Also Read: Omicron symptoms: కోవిడ్-19 కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’.. ఇది డేల్టా కంటే డేంజరా? లక్షణాలేమిటీ?

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. నిన్న ఒక్కరోజులో 82,86,058 (82 లక్షల 86 వేల 58) కరోనా డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. జనవరిలో టీకాలు ప్రారంభించనప్పటి నుంచి ఇప్పటివరకూ 1,21,94,71,143 (121 కోట్ల 94 లక్షల 71 వేల 143) డోసుల కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది. భారత్‌లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,45,72,523 (3.45 కోట్లు)కు చేరగా.. అందులో 3,39,98,278 (3.39 కోట్ల) మంది కోలుకున్నారు.
Also Read: Hyderabad పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!

Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్‌ మామూలుగా ఉండదు!!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Corona coronavirus covid19 India icmr COVID-19 India Corona Cases India Corona Updates CoronaVirus Cases In India India Corona Updates

సంబంధిత కథనాలు

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

‘మిన్నల్ మురళి’ గెటప్‌లో వరుడు.. ఆ పరుగులేంది.. ఆ ఎగురుడేంది?!

‘మిన్నల్ మురళి’ గెటప్‌లో వరుడు.. ఆ పరుగులేంది.. ఆ ఎగురుడేంది?!

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Arunachal Boy Missing Case: అరుణాచల్‌ ప్రదేశ్ బాలుడ్ని భారత ఆర్మీకి అప్పగించిన చైనా

Arunachal Boy Missing Case: అరుణాచల్‌ ప్రదేశ్ బాలుడ్ని భారత ఆర్మీకి అప్పగించిన చైనా
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Stars Social Talk: దుబాయ్‌లో బన్నీ... స్విస్‌లో స‌మంత‌... బికినీలో దిశా, మాళవిక... రష్యాలో రాశీ ఖన్నా!

Stars Social Talk: దుబాయ్‌లో బన్నీ... స్విస్‌లో స‌మంత‌... బికినీలో దిశా, మాళవిక... రష్యాలో రాశీ ఖన్నా!

AP Employees Unions : జీతాల బిల్లులపై ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు .. ఒత్తిడి చేస్తే వెంటనే సమ్మెకు వెళ్తామన్న ఉద్యోగ నేతలు !

AP Employees Unions :  జీతాల బిల్లులపై ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు .. ఒత్తిడి చేస్తే వెంటనే సమ్మెకు వెళ్తామన్న ఉద్యోగ నేతలు !

Weird: ఆయన 129 మంది పిల్లలకు తండ్రి... ఉచిత వీర్యదాత, ఫేస్‌బుక్‌లో వినూత్న సేవ

Weird: ఆయన 129 మంది పిల్లలకు తండ్రి... ఉచిత వీర్యదాత, ఫేస్‌బుక్‌లో వినూత్న సేవ