Corona Cases: 84 రోజుల తర్వాత 4 వేలు దాటిన కరోనా కేసులు- ఆ రెండు రాష్ట్రాల్లోనే
Corona Cases: దేశంలో కొత్తగా 4,041 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు.
Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 4,041 మందికి కరోనా సోకింది. 10 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 21 వేల మార్కు దాటింది. ముందురోజు 3,712 కేసులు నమోదుకాగా తాజాగా 300కు పైగా పెరిగాయి. 84 రోజుల తర్వాత కొత్త కేసులు 4 వేలకు పైగా నమోదయ్యాయి.
#COVID19 | India reports 4,041 fresh cases, 2,363 recoveries, and 10 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 3, 2022
Total active cases are 21,177. pic.twitter.com/XNfnLxQrbd
- మొత్తం కరోనా కేసులు: 4,31,68,585
- మొత్తం మరణాలు: 5,24,651
- యాక్టివ్ కేసులు: 21,177
- మొత్తం రికవరీలు: 4,26,22,757
వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా గురువారం 12,05,840 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,93,83,72,365కు చేరింది. ఒక్కరోజే 4,25,379 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
ఆ రెండు రాష్ట్రాల్లో
కేరళలో 1,370, మహారాష్ట్రలో 1,045 మంది వైరస్ బారినపడ్డారు. ఆ రెండు రాష్ట్రాల్లోనే రెండు వేలకు పైగా కేసులున్నాయి. ముంబయిలో పాజిటివిటీ రేటు ప్రమాదకరస్థాయిలో ఉంది. దీంతో ప్రజలంతా కొవిడ్ నిబంధనలను పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కోరారు.
Also Read: Priyanka Gandhi Corona Positive: కాంగ్రెస్‌లో కరోనా కలకలం- ప్రియాంక గాంధీకి కొవిడ్ పాజిటివ్