అన్వేషించండి

PM Narendra Modi:పెద్దన్నా, అంతొద్దన్నా; అమెరికాకు మోదీ ఇచ్చిన సందేశం ఇదేనా?

PM Narendra Modi:కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ అవసరం లేదు, ఈ విషయంపై చర్చించే ముచ్చటే లేదని తేల్చి చెప్పేశారు

PM Narendra Modi: జాతీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి మోదీ కీలక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. వందల ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న జమ్ముకశ్మీర్ సమస్యను తాను పరిష్కరిస్తానంటూ ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేట్మెంట్‌ ఇచ్చారు. ఇది ఇండియాలో పెద్ద చర్చకే దారి తీసింది. అయితే ప్రధానమంత్రి మోదీ మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించకుండానే చాలా క్లియర్‌గా పెద్దన్న అవసరం లేదు అని చెప్పేశారు. అసలు జమ్ముకశ్మీర్‌పై సమస్యే లేదని స్పష్టం చేశారు. 

పాకిస్థాన్‌తో తాను చర్చలకు కూర్చోవాలంటే అది పీవోకే, ఉగ్రవాదంపై మాత్రమే అని చెప్పిన ప్రధాన మంత్ర మోదీ టోన్‌లో చాలా డెప్త్ ఉందని అంటున్నారు. జమ్ముకశ్మీర్ అనేది ఇక్కడ సమస్య కాదని పీవోకే మాత్రమే సమస్యగా చెప్పేశారు. అన్నింటి కంటే ముఖ్యమైన మరో సమస్య ఉగ్రవాదమని ఈ రెండు విషయాలపై మాత్రమే చర్చించేందుకు సిద్దమని తేల్చి చెప్పారు.
 
ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి చేయలేమని ప్రధాని మోదీ అన్నారు మరియు "నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన రెండు వారాల తర్వాత, మే 7న భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని మోదీ తొలి స్పందన ఇది. ఇది యుద్ధాల యుగం కాదు' అనే తన సందేశాన్ని పునరుద్ఘాటించారు. అలాగనే ఉగ్రవాదుల యుగం కూడా దాని తెలిపారు. "యుద్ధభూమిలో ప్రతిసారీ పాకిస్తాన్‌ ఓడిపోయింది. ఈసారి ఆపరేషన్ సిందూర్‌లో కొత్త అంశాన్ని జోడించాం. ఆపరేషన్ టైంలో 'భారతదేశంలో తయారు చేసిన' ఆయుధాలను వాడాం. వాటి ప్రామాణికత నిరూపితమైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అందరం ఐక్యంగా ఉండాలి. ఈ ఐక్యత మనకు అతిపెద్ద బలం" అని మోదీ అన్నారు.

మే 10న ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి మాట్లాడుతూ "మొదటి మూడు రోజుల్లోనే పాకిస్తాన్‌లో భారత్‌ భారీ విధ్వంసం సృష్టించింది, అది వారిని పూర్తిగా నిస్సహాయులను చేసింది. భారత్‌ దూకుడు ఫలితంగా ఉద్రిక్తత తగ్గించడానికి పాకిస్థాన్ మార్గాలు వెతుక్కుంది. అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. పూర్తిగా ఓడిపోయిన తర్వాత మే 10 మధ్యాహ్నం మన DGMOని సంప్రదించి వేడుకుంది." అని ఈ క్రెడిట్ కూడా అమెరికాకు ఇవ్వలేదు మోదీ. పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చిందని చెప్పారు. అంతే కానీ అమెరికా చెప్పిందనో ఎవరో బెదిరించారోనే వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. 

క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్న ట్రంప్ 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఇష్యూలో తానే క్రెడిట్ కొట్టేసేందుకు యత్నించారు. అందుకే ఇరు దేశాలతో చర్చలు జరిపామని అంగీకరించకుంటే వ్యాపారాలు నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చారు. రెండు దేశాలు అణ్వాయుధ శక్తులని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశామన్నారు. ఇందులో తన కృష్టి ఫలిచిందని అన్నారు. 

అణు యుద్ధాల గురించి అమెరికా అధ్యక్షుడు చెప్పిన విషయాన్ని భారత్ ఖండించింది. అణ్వాయుధాలు ఉపయోగించాలన్న ఆలోచన భారత్‌కు ఎప్పుడూ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి కూడా 9 ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టు వివరించాయి. కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని ఉన్నత వర్గాలు ABP న్యూస్‌తో తెలిపాయి. మీరు ఆగిపోతే మేం ఆగిపోతామని పాక్ DGMO అభ్యర్థనకు భారతదేశం అంగీకరించిందని తెలిపాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget