Lok Sabha election 2024 Phase 4 Voting Live: దేశవ్యాప్తంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్ - అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైన రాష్ట్రాలివే!
Lok Sabha election 2024 Phase 4 polling Live: దేశ వ్యాప్తంగా ఇదివరకే 3 విడతల పోలింగ్ జరిగింది. నేడు 4వ విడతలో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
LIVE
Background
Lok Sabha election 2024 Phase 4 polling live updates- న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇదివరకే 3 విడతల పోలింగ్ జరిగింది. లోక్ సభ ఎన్నికల 4వ విడత పోలింగ్ సోమవారం (మే 13న) 96 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఈసీ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు 25 లోక్ సభస్థానాలకు, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా 10 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో నేడు ఓటింగ్ జరుగుతోంది.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పలు రాష్ట్రాల్లో ఈసీ నిర్ణయాలు తీసుకుంది. పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. 1.92 లక్షల పోలింగ్ స్టేషన్లలో 17.7 కోట్ల మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్, వీల్ చైర్లు లాంటివి ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాతో పాటు జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ 25 ఎంపీ స్థానాలు, తెలంగాణ 17 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్‌లో 8, పశ్చిమ బెంగాల్‌లోని 8 లోక్ సభ స్థానాలకు, బీహార్, జార్ఖండ్‌ల్లో ఐదు స్థానాలకు, ఒడిశాలో నాలుగు సీట్లకు, జమ్మూ కాశ్మీర్‌లో ఒక స్థానానికి ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాతో పాటు జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ 25 ఎంపీ స్థానాలు, తెలంగాణ 17 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్‌లో 8, పశ్చిమ బెంగాల్‌లోని 8 లోక్ సభ స్థానాలకు, బీహార్, జార్ఖండ్‌ల్లో ఐదు స్థానాలకు, ఒడిశాలో నాలుగు సీట్లకు, జమ్మూ కాశ్మీర్‌లో ఒక స్థానానికి ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది.
పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లో సోమవారం లోక్‌సభ ఎన్నికల నాల్గవ విడత పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన అధిర్ రంజన్ చౌదరి, టీఎంసీ నుంచి శతృఘ్న సిన్హా, మహువా మోయిత్రా, క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ముఖ్యులుగా ఉన్నారు. వీరితో పాటు బీజేపీ నేతలు ఎస్‌ఎస్ అహ్లువాలియా, దిలీప్ ఘోష్‌లు బరిలోకి దిగారు.
ఉత్తర ప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లో అందరి దృష్టి కనౌజ్, ఖేరీలపై ఉంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కనౌజ్ నుంచి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని ఖేరీ నుంచి పోటీ చేస్తున్నారు. ఉన్నావ్‌లో బిజెపి ఎంపి సాక్షి మహరాజ్ ఎస్పీ నేత అన్నూ టాండన్‌తో తలపడ్డారు.
మహారాష్ట్ర
మహారాష్ట్రలో కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే, బీజేపీ నాయకురాలు పంకజా ముండే, నటుడు అమోల్ కొల్హే వంటి ప్రముఖులు బరిలో నిలిచారు. అన్ని పార్టీలు సెంట్రల్ మరాఠ్వాడా, ఉత్తర , పశ్చిమ ప్రాంతాలపై ఫోకస్ చేసింది. 2.28 కోట్లకు పైగా ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
బిహార్
బిహార్ నుంచి ముఖ్యనేతలలో బెగుసరాయ్‌లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, సీపీఐకి చెందిన అవధేష్ రాయ్ మధ్య పోటీ నెలకొంది. ఉజియార్‌పూర్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. JD(U) మాజీ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ 'లాలన్' కు ఆర్జేడీ నేత కుమారి అనితతో పోటీ ఎదుర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్ - అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైన రాష్ట్రాలివే!
దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 62.31 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా పశ్చిమబెంగాల్ లో 75.66 శాతం నమోదు కాగా.. ఏపీ 68 శాతం, తెలంగాణ 61.16, మధ్యప్రదేశ్ 68.01, ఒడిశా 62.96, మహారాష్ట్ర , బీహార్ 56.14, యూపీ 56.35, జమ్ముకశ్మీర్ - 35.75, ఝార్ఖండ్ - 63.14 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ - మధ్యాహ్నం 3 గంటల వరకూ రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం వివరాలివే
దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతాన్ని చూస్తే.. ఏపీ - 55.49 శాతం, తెలంగాణ -52.34 శాతం, బీహార్ - 45.23, జమ్ముకశ్మీర్ - 29.93, ఝార్ఖండ్ - 56.42, మధ్యప్రదేశ్ - 59.63, మహారాష్ట్ర - 42.35, ఒడిశా - 52.91, పశ్చిమబెంగాల్ - 66.05 శాతం, ఉత్తరప్రదేశ్ - 48.41 శాతంగా నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న పోలింగ్ - మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40.32 శాతం పోలింగ్
దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 40.32 శాతం పోలింగ్ నమోదైంది. ఏపీ - 36, తెలంగాణ - 40.38, బీహార్ - 34.44, జమ్మూకశ్మీర్ - 23.57, ఝార్ఖంఢ్ - 43.80, మహారాష్ట్ర - 30.85, మధ్యప్రదేశ్ - 48.52, ఒడిశా - 39.30, ఉత్తరప్రదేశ్ - 39.68, పశ్చిమబెంగాల్ - 51.87 శాతంగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతం - రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం వివరాలు
దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ సగటున 24.87 శాతం ఓటింగ్ నమోదైంది. ఏపీ - 23.10 శాతం, తెలంగాణ - 24.31, బీహార్ - 22.54, ఝార్ఖండ్ - 27.40 శాతం, మధ్యప్రదేశ్ - 32.38 శాతం, మహారాష్ట్ర - 17.51, ఒడిశా - 23.28, ఉత్తరప్రదేశ్ - 27.12, పశ్చిమబెంగాల్ - 32.78 శాతంగా నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
#LokSabhaElections2024 | 24.87% voter turnout recorded till 11 am, in the fourth phase of elections.
— ANI (@ANI) May 13, 2024
Andhra Pradesh 23.10%
Bihar 22.54
Jammu And Kashmir 14.94%
Jharkhand 27.40%
Madhya Pradesh 32.38%
Maharashtra 17.51%
Odisha 23.28%
Telangana 24.31%
Uttar Pradesh 27.12%… pic.twitter.com/Awy60bMdeG
దేశవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ - ఉదయం 11 గంటల వరకూ 24.87 శాతం ఓటింగ్ నమోదు
దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఉదయం 11 గంటల వరకూ 24.87 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.