News
News
X

India China Faceoff: భారత్-చైనా సరిహద్దులో మరోసారి ఘర్షణ, 30 మంది సైనికులకు గాయాలు!

India China Faceoff: భారత్, చైనా సరిహద్దులో మరోసారి ఘర్షణ తలెత్తింది. ఈ నెల 9న ఇరు దేశాల సైనికులు ఘర్షణ పడినట్లు సమాచారం.

FOLLOW US: 
Share:

India China Faceoff: భారత్, చైనా సరిహద్దులో ఇటీవల ఘర్షణ వాతావరణం నెలకొందని తెలుస్తోంది. డిసెంబర్ 9న భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని LAC సమీపంలో భారత్ చైనా సైనికులు ఘర్షణ పడ్డినట్లు సమాచారం. ఈ ఘర్షణలో ఇరు దేశ సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. డిసెంబర్ 9న చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని LAC దాటి రావడంతో భారత దళాలు వారిని అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన కొంతమంది సిబ్బందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత ఇరు దేశ సైనికులు ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏఎన్ఐ వార్తా  సంస్థ ధృవీకరించింది. 

రెండేళ్ల తర్వాత మరోసారి ఉద్రికత్త 

లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత మరోసారి సరిహద్దులో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల సైనికులు మళ్లీ ఘర్షణకు దిగాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. ఇరువైపులా ఎవరూ మరణించినట్లు నివేదికలు లేనప్పటికీ, కొంతమంది భారత సైనికులకు గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం సమస్యను చర్చించడానికి భారత కమాండర్ తన కౌంటర్‌ పార్ట్ చైనా అధికారితో ఫ్లాగ్ మీటింగ్‌ను నిర్వహించారు. 

ఈ ప్రాంతంలో గతంలోనూ ఘర్షణ 

హిల్ స్టేట్స్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వివాదాస్పద సరిహద్దులో ఇరుపక్షాల మధ్య ఈ ఘర్షణ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్‌కు ఈశాన్యంగా 35 కిమీ దూరంలోని యాంగ్ట్సే వద్ద అక్టోబర్ 2021లో ఇలాంటి ఘర్షణే జరిగింది. 17,000 అడుగుల శిఖరాన్ని చేరుకోవడానికి చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్‌ అప్పట్లో అడ్డుకుంది. ఈ ప్రాంతం ఇప్పుడు మంచుతో కప్పబడిఉంది. మార్చి నెల వరకు అలాగే ఉంటుంది. తూర్పు లడఖ్‌లోని రించెన్ లా సమీపంలో ఆగస్టు 2020 ఘర్షణ తర్వాత ఈ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య ఇది ​​మొదటి భౌతిక ఘర్షణగా తెలుస్తోంది.

30 మందికి గాయాలు

ఈ ఘర్షణలో 30 మందికి పైగా భారత సైనికులు గాయపడ్డారని ABP న్యూస్‌కి పలు సోర్సెస్ ద్వారా తెలిసింది. తవాంగ్ సెక్టార్‌లో జరిగిన ఘర్షణలో గాయపడిన ఆరుగురు సైనికులను చికిత్స కోసం గౌహతికి తీసుకువచ్చినట్లు పీటీడీ నివేదించింది. చైనా వైపున గాయపడిన సైనికులు భారత్ కన్నా ఎక్కువ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. "తవాంగ్‌లోని భారత సైనికులు చైనా సైనికులకు తగిన సమాధానం ఇచ్చారు. గాయపడిన చైనా సైనికుల సంఖ్య భారత సైనికుల కంటే ఎక్కువ. దాదాపు 300 మంది సైనికులతో చైనీయులు భారీగా ఎల్ఏసీ వద్దకు వచ్చారు. అయితే భారత సైనికులు వారిని వీరోచితంగా ఎదుర్కొన్నారు." సైనిక వర్గాలు పేర్కొన్నాయి. కొంత సేపటి తర్వాత ఇరువర్గాలు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారని విశ్వసనీయం సమాచారం.

Published at : 12 Dec 2022 07:55 PM (IST) Tags: LaC Arunachal Pradesh PLA India China faceoff Tawang sector

సంబంధిత కథనాలు

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

CBSE Hall Tickets: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CBSE Hall Tickets: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

UP Crime News: అత్తారింటికి వెళ్తుండగా వధువు జంప్‌ - మత్తు దిగాక బోరుమన్న వరుడు!

UP Crime News: అత్తారింటికి వెళ్తుండగా వధువు జంప్‌ - మత్తు దిగాక బోరుమన్న వరుడు!

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

టాప్ స్టోరీస్

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?

Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం

Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం