ఇండియా పేరు మార్పుపై పరోక్షంగా ప్రధాని మోదీ క్లారిటీ, G20 సదస్సులో నేమ్‌ప్లేట్‌పై "భారత్"
India Bharat Name Change Row: G20 సదస్సులో ప్రధాని మోదీ కూర్చున్న చోట నేమ్ ప్లేట్‌పై భారత్ అని రాసుండడం ఆసక్తికరంగా మారింది.
India Bharat Name Change Row:
ప్రధాని నరేంద్ర మోదీ G20 సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొరాకోలో భూకంప విపత్తులో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డవాళ్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ కష్టకాలంలో మొరాకో దేశానికి ఎలాంటి సాయమైనా అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. మోదీ కూర్చున్న స్థానంలో ముందు నేమ్‌ప్లేట్ ఆసక్తికరంగా మారింది. దానిపై India కి బదులుగా Bharat అని రాసుంది. పేరు మార్పుపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై ఆ పేరు కనిపించింది. విపక్షాలు దీనిపై ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండి పడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో భారత్ అని కనిపించడం వల్ల కేంద్రం అందుకు సిద్ధంగానే ఉందని సంకేతాలిచ్చినట్టైంది.
#WATCH | G 20 in India | PM Modi at the G 20 Summit says "Before we start the proceedings of G20, I want to express my condolences over the loss of lives due to an earthquake in Morocco. We pray that all injured recover at the earliest. India is ready to offer all possible… pic.twitter.com/ZTqcg11cKI
— ANI (@ANI) September 9, 2023
యూరప్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇండియా పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమికి I.N.D.I.A అనే పేరు పెట్టడం వల్లే బీజేపీ భారత్ అనే పేరు పెట్టాలనుకుంటోందని విమర్శించారు. బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్‌కి ఇదే నిదర్శనమని మండి పడ్డారు రాహుల్. ఇండియా అంటేనే భారత్ అని, మళ్లీ పేరు మార్చాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ప్రభుత్వం భయపడుతోందనడానికి, ఈ పేరు మార్పు రాజకీయాలే ఉదాహరణ అని అన్నారు.
"ఇండియా అంటే భారత్. ఈ పేరు బాగానే ఉంది. ఇదే మనమేంటో ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ మోదీ ప్రభుత్వానికి ఎక్కడో ఓ భయం పట్టుకుంది. మేం I.N.D.I.A అని పేరు పెట్టుకోగానే వెంటనే దేశం పేరు మార్చాలని ప్రతిపాదించింది. కేవలం భయంతో వచ్చిన ప్రతిపాదనే ఇది. ఇవి డైవర్షన్ పాలిటిక్స్. అదానీ వ్యవహారం గురించి మేం మాట్లాడిన ప్రతిసారీ వేరే కొత్త టాపిక్ తెరపైకి తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
ఈ వివాదంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీపై విరుచుకు పడ్డారు. ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగాన్ని మార్చాలని తేల్చి చెప్పారు. బీజేపీకి నిజంగా ధైర్యం ఉంటే...రాజ్యాంగాన్ని మార్చాలని సవాల్ విసిరారు. రాజ్యాంగాన్ని మార్చే విషయంలో ఎవరు బీజేపీకి మద్దతుగా ఉంటుందో చూస్తామని అన్నారు. ఎవరూ ఇండియా పేరుని మార్చలేరని స్పష్టం చేశారు.
Also Read: G20 Summit 2023: బైడెన్‌కి షేప్ ఆఫ్ యూ పాటతో వెల్కమ్, నెటిజన్ల ఆగ్రహం - వైరల్ వీడియో