Independence Day 2023: ఈ ఏడాది 76వ స్వాతంత్ర దినోత్సవమా, లేక 77వదా - ఇక్కడ తెలుసుకోండి!
Independence Day 2023: ప్రతీసారి లాగే ఈ ఏడాది కూడా మనం ఎన్నో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామనే దానిపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఇది 76వదా, 77వదా అని గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు.
Independence Day 2023: చాలా మందికి ప్రతీ ఏడాది కొన్ని డౌట్లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవాలలో కొన్ని అనుమానాలు కల్గుంతుంటాయి. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా కొందరు కన్ ఫ్యూజ్ అవుతుంటారు. అదేంటీ అంటారా.. అదేంటంటే ఇప్పుడు వచ్చే స్వాతంత్ర దినోత్సవం 76వదా, 77వదా అని చాలా మంది కన్ ఫ్యూజ్ అవుతున్నారు. ఇది తెలుసుకునేందుకు చాలా మంది స్నేహితులను అడగడం, గూగుల్ లో సెర్చ్ చేయడం చేస్తున్నారు. అందుకే దీనిపై మేము మీకో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. రెండు శతాబ్దాల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుంచి భారత్ కు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం లభించింది. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి అయిన ఆగస్టు 15వ తేదీపై ఈ వివరాలు తెలుసుకోండి.
ఇది భారతదేశ 76వ లేదా 77వ స్వాతంత్ర్య దినోత్సవమా?
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే విషయం అదంరికీ తెలిసిందే. దాదాపు 190 ఏళ్ల బ్రిటిష్ పాలనకు ముగింపు పలికి, నియంత్రణ పగ్గాలు దేశ నాయకులకు అప్పగించన రోజే స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం 1948 ఆగస్టు 15న నిర్వహించారు. ఈ లాజిక్‌తో భారతదేశం తన 76వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదటి సంవత్సరం ఆగస్టు 15, 1947 అని లెక్కిస్తే.. దేశం కష్టపడి సంపాదించిన స్వాతంత్య్రానికి 76 సంవత్సరాలు పూర్తవుతుంటే, 15 ఆగస్టు 2023 భారతదేశానికి 77వ స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాలి. రెండు వాదనలు నిజమే అయినప్పటికీ.. భారతదేశం 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇది ఇప్పటికీ 2023లో స్వాతంత్ర్యం యొక్క 77వ సంవత్సరం.
స్వాతంత్ర్య దినోత్సవం 2023 థీమ్..
ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం 2023 యొక్క థీమ్ "నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్". ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నది దీని ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" లో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి.