Independence Day 2023: స్వాతంత్య్ర పోరాటంలో వీరనారులు - పెన్ను ఎక్కుపెట్టి అసమాన పోరాటం
Independence Day 2023: భారత స్వాతంత్ర్య పోరాటంలో మహిళా రచయితలు తమ రచనలతో పౌరుల్లో స్వేచ్ఛా కాంక్షలు రగిలించారు.
Independence Day 2023: భారత స్వాతంత్ర్య పోరాటంలో మహిళా రచయితలు ప్రముఖ పాత్ర పోషించారు. బ్రిటీష్ పాలన దురాగతాలను పౌరులకు విశదీకరించడానికి, వివరించి చెప్పి వారిలో అవగాహన కల్పించడానికి ఎంతో కృషి చేశారు. పౌరులను ప్రేరేపించి వారిని స్వాతంత్ర్య పోరాటంలో భాగం చేయడానికి ఎంతో శ్రమించారు. ఆయుధాల కంటే పదునైన పెన్నులను ఎక్కుపెట్టి బ్రిటీష్ వలస పాలనపై యుద్ధం చేశారు. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ మహిళా రచయిత్రులు కీలక పాత్ర పోషించారు.
సరోజినీ నాయుడు
సరోజినీ నాయుడు కవి, స్వాతంత్ర్యం సమరయోధురాలు, రాజకీయవేత్త. తన అందమైన కవిత్వంతో పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నారు. దేశం పట్ల తనకు ఉన్న ప్రేమను, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కోసం సరోజినీ నాయుడు కృషి చేశారు. ఆమె శక్తివంతమైన వక్త కూడా. ఆమె తన ప్రసంగాలను భారత స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతును కూడగట్టడానికి తన రచనలను వాడారు.
మహాదేవి వర్మ
మహాదేవి వర్మ నవలా రచయిత, కథా రచయిత. సామాజిక కార్యకర్త కూడా అయిన మహాదేవి వర్మ.. అన్యాయం, పేదరికం, మహిళల హక్కులను ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసే వారు. ఆమె బ్రిటీష్ వలస పాలనపై చాలా బలంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఘాటైన విమర్శలతో బ్రిటీష్ ప్రభువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.
బీనా దాస్
బీనా దాస్ నాటకాలు, నవలలు రాసేవారు. భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన మొదటి మహిళల్లో బీనా దాస్ ఒకరు. ఆమె మహిళల హక్కుల కోసం తన రచనలను వాడారు. ఆమె భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవాత్మక పార్టీ అయినా గదర్ పార్టీలో కూడా బీనా దాస్ సభ్యురాలు.
అన్నీబిసెంట్
అన్నీబిసెంట్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖులు. ఆమె ఆంగ్లేయురాలు అయినప్పటికీ భారత దేశ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పోరాడారు. తన వాక్చాతుర్యంతో పౌరుల్లో ముఖ్యంగా మహిళలో అవగాహన కల్పించారు. స్థానికులకు అన్యాయం చేస్తున్న బ్రిటీష్ పాలనను అంతం చేయాలని అన్నీబిసెంట్ పిలుపునిచ్చారు.
లక్ష్మీబాయి తిలక్
తిలక్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ నాయకులైన బాల గంగాధర తిలక్ సతీమణి. భర్తతో పాటు స్వతంత్ర ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు లక్ష్మీబాయి తిలక్. తన ప్రసంగాలతో అవగాహన కల్పించేవారు. స్వతంత్ర కాంక్షలు రేకెత్తించారు.
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి
లక్ష్మీబాయి భారతదేశంలోని రాచరిక రాష్ట్రమైన ఝాన్సీకి రాణి. ఆమె 1857 భారత తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతురాలు. ఆమె భారతదేశంలో వీరవనితగా పేరుగాంచారు. ఆమె కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.
ఆద్యంతం స్వతంత్ర్య సంగ్రామంలో వనితలు
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మహిళలు మొదటి నుంచీ ఉన్నారు. ఆఖరి వరకు పోరాడారు. 1857లో తిరుగుబాటు సమయంలో పురుషులకు సరిసమానంగా పని చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు ముందుండి పోరాడితే.. వారి వెనక ఉండి ధైర్యాన్ని నూరిపోసిన వారు లెక్కకు మిక్కిలే ఉంటారు. ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా వంటి మహిళా సంస్థలు మహిళల హక్కుల సమస్యలపై అవగాహన కల్పించడంలో స్వేచ్ఛకు మద్దతుగా మహిళలను సమీకరించడంలో ప్రధాన పాత్ర పోషించాయి.