By: ABP Desam | Updated at : 25 May 2022 05:32 PM (IST)
Edited By: Murali Krishna
ఏందిరా నీ సారీ గోల- కాలేజీ గోడలు, మెట్ల నిండా 'సారీ' కోటి!
Karnataka News: "ఐయాం వేరీ సారీ.. అన్నాగా వెయ్యో సారీ.. సరదాగా నవ్వేసే ఓ సారీ" ఇది తరుణ్ నటించిన 'నువ్వేనువ్వే' సినిమాలో ఓ సాంగ్. ఈ సాంగ్‌లో అలిగిన హీరోయిన్ శ్రియను.. తిరిగి మాట్లాడించేందుకు నానా తంటాలు పడుతూ "సారీ, సారీ" అని హీరో వెనకాల తిరుగుతాడు. అయితే ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? సేమ్ ఇలాంటి సీన్ కర్ణాటక బెంగళూరులో రిపీటైంది.
Karnataka | 'Sorry' painted all over the premises of a private school and on the streets surrounding it in Sunkadakatte
— ANI (@ANI) May 25, 2022
Two bike-borne persons were seen in the CCTV footage. Efforts on to identify and trace them: Dr Sanjeev Patil, DCP West Bengaluru pic.twitter.com/mbrbznwu7x
ఏం జరిగింది?
కర్ణాటక బెంగళూరులోని ఓ కళాశాల ప్రాంగణమంతా సారీ.. సారీ అనే పెయింటింగ్‌లతో నింపేశారు ఆకతాయిలు. సుంకదకట్టె ప్రాంతంలో కొంతమంది ఆకతాయిలు చేసిన ఈ పని పోలీసులకు తలనొప్పులు తెచ్చి పెట్టింది. సుంకదకట్టెలోని ఓ ప్రైవేట్ కళాశాల గోడలు, మెట్లతో పాటు పాఠశాల చుట్టూ ఉన్న వీధుల్లో కొంతమంది ఆకతాయిలు సారీ..సారీ.. అంటూ పెయింట్‌తో రాశారు. ఉదయాన్నే చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సీసీ టీవీ
కళాశాలకు చేరుకున్న పోలీసులు ఇది చూసి అవాక్కయ్యారు. ఆకతాయిలు చేసిన ఈ పని అంతా సీసీటీవీలో రికార్డైంది. దీంతో ఆ ఫుటేజిని పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. దీని ఆధారంగా వారిని గుర్తించే పనిలో పడ్డారు.
ఓ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి కళాశాల గోడల మీద, చుట్టుపక్కల వీధుల్లో సారీ..సారీ.. అంటూ రాసినట్లు ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే అదే కళాశాలలో చదివే ఓ అమ్మాయి కోసమే వారు ఇలా చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వీరిని గుర్తించి తగిన కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు.
Also Read: Yasin Malik: కశ్మీర్ వేర్పాటువేద నేత యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష వేయాలి: NIA
Also Read: Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!
Wrestlers At Haridwar: గంగా నదిలో మెడల్స్ పారవేసేందుకు సిద్ధమైన రెజ్లర్లు, అంతలోనే ఆసక్తికర పరిణామం
Chhattisgarh News: ఫోన్ కోసం రిజర్వాయర్ నీళ్లనే తోడించిన ఆఫీసర్, సస్పెండ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు
Siddaramaiah: సిద్ధరామయ్య కీలక నిర్ణయం- రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డులో అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశం
RBI Fake Notes : రూ. 500 నోట్లలో ఫేక్ చాలా ఎక్కువట - ఆర్బీఐ చెప్పిన సంచలన విషయాలు ఇవిగో
Vande Bharat Express: సికింద్రాబాద్ -నాగ్ పూర్ మధ్య వందే భారత్ రైలు, త్వరలోనే అందుబాటులోకి!
KTR : జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !
BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?
TSPSC Paper Leak Case: టీఎస్ పీఎస్సీ సంచలన నిర్ణయం, జీవితాంతం ఎగ్జామ్స్ రాయకుండా 37 మందిని డీబార్
APJAC Protest: సీపీఎస్ రద్దు హామీకి అతీ గతీ లేదు, డిమాండ్లు పరిష్కరించమనడం తప్పా?: బొప్పరాజు సూటిప్రశ్న