Ideas of India Summit 2023: రెండు రోజుల 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్ ప్రారంభించిన ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే
రెండు రోజుల 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్‌ను ABP నెట్‌వర్క్ CEO అవినాష్ పాండే లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో అనేక మంది ప్రముఖులు అనేక సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
![Ideas of India Summit 2023: రెండు రోజుల 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్ ప్రారంభించిన ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే Ideas of India 2023 by ABP Network CEO Avinash Pandey formally opened two-day Ideas of India summit Ideas of India Summit 2023: రెండు రోజుల 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్ ప్రారంభించిన ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/24/fac1f3ac2f840c93b67df356e48553061677215801161215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ABP Network Ideas of India Summit 2023: ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే రెండు రోజుల 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా అతిథులను స్వాగతించారు. రాబోయే రెండు రోజుల్లో సమాజంలోని అగ్రశ్రేణి వ్యక్తులు అనేక అంశాల గురించి తమ ఆలోచనలను పంచుకుంటారని చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, కోవిడ్ మహమ్మారితో పోరాడిన ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టైంలో జరుగుతున్న శిఖరాగ్ర సమావేశంపై చాలా విషయాలు మాట్లాడారు. కోవిడ్ మహమ్మారిపై భారతదేశం చేస్తున్న పోరాటం, ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయవంతమైన టీకా కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
దేశంలోనే కాకుండా దేశ సరిహద్దులు ఆవల ఉన్న సక్సెస్ పీపుల్ ఆలోచనలతో అనేక రంగాల్లో ఉన్న ప్రముఖలందర్నీ ABP నెట్‌వర్క్ 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' వేదికగా మార్చింది. 2022లో అత్యంత విజయవంతమైన ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ సమ్మిట్ గ్రాండ్ సెకండ్ ఎడిషన్ నయా ఇండియా: లుకింగ్ ఇన్‌వర్డ్, రీచింగ్ అవుట్ అనే థీమ్‌తో రూపొందించారు.
ఈ సంవత్సరం ముంబైలో జరిగే 2-రోజుల ఈవెంట్ ప్రధానంగా ఈ ప్రశ్నకు సమాధానాలను వెతకనుంది. చరిత్రలో భారత్ ఎలాంటి స్థితిలో నిలిచింది? ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. ఐరోపాలో యుద్ధచ్ఛాయలు కనిపిస్తున్నా ఇంధన అవసరాలను సమర్థంగా తీర్చుకుంటోంది. కరోనా తర్వాత ఇండియాను గ్లోబల్ లీడర్‌గా ప్రపంచం చూస్తోంది. ఈ టైంలో భారత యువత వివిధ రంగాల్లో నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉందా? అసహనంతో ఉందా అనేదానిపై చర్చ జరగనుంది.
ఈ కీలకమైన ప్రశ్నను ఆలోచనాపరులు, వ్యాపారవేత్తలు, సాంస్కృతిక రాయబారులు, రాజకీయ నాయకులు ఇలా వక్తల జాబితా చాలా పెద్దదిగా వైవిధ్యంగా ఉంటుంది. యూకే మాజీ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ నుంచి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఏక్నాథ్ షిండే వంటి ముఖ్యమంత్రుల వరకు విస్తరించింది; నవలా రచయిత, పర్యావరణ ఛాంపియన్ అమితవ్ ఘోష్ నుంచి టెక్, బిజినెస్ ఇన్నోవేషన్ ఐకాన్ ఎన్ ఆర్ నారాయణ మూర్తి వరకు; అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన విద్యావేత్త, రచయిత మహమూద్ మమదానీ నుంచి కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, మరో కేంద్ర మంత్రి-ఇన్‌చార్జ్ అశ్విని వైష్ణవ్, కళలు, సినిమా ప్రపంచం నుంచి జీనత్ అమన్, ఆశా పరేఖ్ వంటి వారితోపాటు ఆయుష్మాన్ ఖురానా వంటి సూపర్ స్టార్‌లు ఇందులో పాల్గొంటున్నారు.
ఎందరికో ఆదర్శంగా ఉండే వినేష్ ఫోగట్, అశ్విని నాచప్ప, జ్వాలా గుత్తా, జోష్నా చినప్ప తమ ఆలోచనలు పంచుకోనున్నారు. 'ఖాన్ సార్', 'ఎన్‌వి సార్' వంటి విద్యా మార్గనిర్దేశకులు నాలెజ్డ్ పొందడంపై మాట్లాడతారు. అంతర్జాతీయ చలనచిత్ర దర్శకులు మీరా నాయర్, శేఖర్ కపూర్, నటులు మనోజ్ బాజ్‌పేయి కూడా ప్యానెల్‌లో ఉన్నారు. లక్కీ అలీ, దేవదత్ పట్నాయక్ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తారు. సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా తన వంట మహత్యాన్ని పంచుకోనున్నారు. యువ రాజకీయ ప్రముఖులు పూనమ్ మహాజన్, కె కవిత, ప్రియాంక చతుర్వేది, రాఘవ్ చద్దా వారి వ్యక్తిగత జీవితం, రాజకీయ పార్టీల విధానాలను వివరిస్తారు. నయా భారతదేశం కోసం తీసుకోవాల్సిన అంశాలను వివరిస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)