అన్వేషించండి

Himachal Rains: భారీ వర్షాలకు హిమాచల్‌ ప్రదేశ్‌లో అపార నష్టం - 8 వేల కోట్ల లాస్, 346 మంది మృతి

Himachal Rains: హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు కుదిపేసి అపార నష్టాన్ని మిగిల్చాయి. అలాగే ఈ ఘోర ప్రకృతి విపత్తులో 340 మందికి పైగా మృతి చెందారు.

Himachal Rains: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి కుదిపేసింది. భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. దట్టంగా, ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహించి వరదలకు కారణం అయ్యాయి. కొండ చరియలు విరిగిన, రోడ్లు తెగిపోయి, వంతెనలు, భవనాలు నీటిలో కొట్టుకుపోవడంతో 346 మంది చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తు వల్ల రెండు నెలల్లో దాదాపు రూ.8,100 కోట్ల నష్టం వాటిల్లినట్లు హిమాచల్ ప్రదేశ్ సర్కారు అంచనా వేసింది. ఈ ఏడాది వినాశకర వర్షాల ప్రభావం నుంచి కోలుకోవడానికి హిమాచల్ ప్రదేశ్ కు సంవత్సరకాలం పడుతుందని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు గతంలో చెప్పుకొచ్చారు. ఈ ప్రకృతి విలయాన్ని విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం అరుదైన తీవ్ర కలిగిన జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని హిమాచల్ ప్రదేశ్ కోరింది. 

భారత వాతావరణ కేంద్రం జూన్ 24న హిమాచల్ ప్రదేశ్ లో రుతుపవనాల ఆగమనాన్ని అంచనా వేసి హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు, మేఘాల విస్ఫోటనాలతో కొండచరియలు విరిగి పడటం, వరదలు సంభవించడం వల్ల చాలా నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం, రుతుపవనాల వర్షాల వల్ల రూ. 8099.46 కోట్ల నష్టం సంభవించింది. ఈ విపత్తులో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 346కు చేరుకుంది. అలాగే 38 మంది గల్లంతయ్యారు. వివిధ వర్షాలకు సంబంధించిన దుర్ఘటనల్లో 331 మంది గాయపడినట్లు సమాచారం. 

వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు తెగిపోవడం, వంతెనలు, భవనాలు కూలిపోవడం వల్ల 2,216 నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 9,819 నివాస సముదాయాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. 300 దుకాణాలు, 4,702 గోశాలలు కొట్టుకుపోయాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 130 కొండచరియలు విరిగిపడగా, 60 ఆకస్మిక వరదలు సంభవించాయి. వివిధ శాఖల పరిధిలో జరిగిన నష్టాలను ఇలా ఉన్నాయి.

  • జలశక్తి విభాగం: రూ. 1860.52 కోట్లు
  • పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌: రూ. 2,712.19 కోట్లు
  • హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లిమిటెడ్: రూ. 1,707.35 కోట్లు
  • హార్టికల్చర్: రూ. 173.3 కోట్లు
  • పట్టణాభివృద్ధి: రూ. 88.82 కోట్లు
  • వ్యవసాయ శాఖ: రూ. 335.73 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి: రూ. 369..53 కోట్లు
  • విద్య శాఖ : రూ. 118.93 కోట్లు  
  • మత్స్యశాఖ: రూ. 13.91 కోట్లు
  • ఆరోగ్య శాఖ: రూ. 44.01 కోట్లు

Also Read: Surgical Strike: పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్! మీడియాలో కథనాలు - భారత ఆర్మీ ఏం చెప్పిందంటే?

హిమాచల్ ప్రదేశ్ కు వరద సాయం కింద కర్ణాటక, రాజస్థాన్ ప్రభుత్వాలు ఒక్కొక్కటి రూ. 15 కోట్లు విరాళంగా ఇచ్చాయి. కేంద్ర సర్కారు ఇప్పటి వరకు రూ. 200 కోట్లు సాయం ప్రకటించింది. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కూడా రూ.11 కోట్లు అందించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Allu Arjun: ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
Embed widget