Heavy Rains in Chennai due to Michaung Cyclone: మిగ్ జాం ఎఫెక్ట్ - చెన్నై నగరం అతలాకుతలం, 8 మంది మృతి
Chennai Heavy Rains: మిగ్ జాం తుపాను ధాటికి చెన్నై మహా నగరం వణికిపోతోంది. వర్షాల వల్ల ఇప్పటికే 8 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వర్షాలు కాస్త తెరిపినివ్వడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Heavy Rains in Chennai due to Michaung Cyclone: మిగ్ జాం తుపాన్ (michaung Cyclone) ధాటికి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) నగరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో వరదలు పోటెత్తాయి. గత 24 గంటల్లో 20 నుంచి 29 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై 5 నుంచి 6 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. భారీ వానలతో జనం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రోడ్డు, రైలు, జల, వాయు మార్గాల్లో రవాణా సేవలు స్తంభించాయి. దాదాపు 70కి పైగా విమాన సర్వీసులు రద్దు చేసిన అధికారులు, మరో 33 సర్వీసులను దారి మళ్లించారు. కాంచీపురం (Kanchipuram), తిరువళ్లూరు (Tiruvallur), చెంగల్పట్టు (Chengalpattu) జిల్లాల్లోనూ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. తుపాను ప్రభావంతో చెన్నైలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, అధికార యంత్రాగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సీఎం స్టాలిన్ అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తుపాను కారణంగా ప్రభావిత జిల్లాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు బ్యాంకులకు మంగళవారం సెలవు ప్రకటించారు.
#WATCH | Tamil Nadu | Chennai city continues to face massive waterlogging triggered due to heavy rain in wake of Severe Cyclonic Storm Michaung that is likely to make landfall today on the southern coast of Andhra Pradesh between Nellore and Machilipatnam today.
— ANI (@ANI) December 5, 2023
Visuals from… pic.twitter.com/bY5iwNa2T4
#WATCH | Tamil Nadu: Pazhavanthangal Subway, in Chennai shuts down due to waterlogging. pic.twitter.com/WrFckIEG2X
— ANI (@ANI) December 4, 2023
#WATCH | Tamil Nadu: Amid heavy rainfall, severe water logging witnessed in Chennai city. pic.twitter.com/eyXfFjpuHf
— ANI (@ANI) December 4, 2023
VIDEO | Cyclone Michaung: Visuals of waterlogging in Guduvancheri, Chengalpattu, Tamil Nadu following heavy rainfall in the region.#CycloneMichuang pic.twitter.com/dcBsdtClzX
— Press Trust of India (@PTI_News) December 5, 2023
#WATCH | Tamil Nadu | Koovam river rages as water from nearby lakes released into it due to heavy rainfall in the city in the wake of Severe Cyclonic Storm Michaung.
— ANI (@ANI) December 5, 2023
Michaung is likely to make landfall today on the southern coast of Andhra Pradesh between Nellore and… pic.twitter.com/NyYMpKOLMg
#WATCH | Tamil Nadu | People wade through chest-deep waters in Pammal areas of Chennai as the city faces massive waterlogging and flood-like situations. #Michaungcyclone pic.twitter.com/XSXVWP9pdl
— ANI (@ANI) December 5, 2023
#WATCH | Tamil Nadu | Buildings near Chembarambakkam in Chennai inundated due to heavy rainfall and subsequent rainfall of lakes and rivers.#Michaungcyclone pic.twitter.com/TIBOBXuzys
— ANI (@ANI) December 5, 2023
#WATCH | Tamil Nadu | Cattle wade through deep waters as Chennai city faces massive waterlogging and flood-like situations.
— ANI (@ANI) December 5, 2023
Visuals from Pammal.#Michaungcyclone pic.twitter.com/Qca7NzJ6CH
తెరిపిచ్చిన వర్షం
కాగా, మంగళవారం ఉదయానికి వర్షం కాస్త తెరిపినివ్వడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఉండకపోవచ్చని అటు వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, తమిళనాడు ఉత్తర తీర ప్రాంతాలు, పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, భారీ వర్షాలతో చెన్నై ఎయిర్ పోర్టును మూసేయగా, మంగళవారం ఉదయం సిబ్బంది రన్ వేపై నీటిని తొలగించారు. విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. నగరంలో కొన్ని చోట్ల వరద ఉద్ధృతితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కూవమ్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను సిబ్బంది పునరుద్ధరిస్తున్నారు. తమిళనాడులో తుపాను కారణంగా వర్షాల వల్ల 8 మంది మృతి చెందడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు, ఏపీ, ఒడిశాలో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.
Also Read: Cyclone Michaung News: రవాణా వ్యవస్థపై మిగ్‌జాం ఎఫెక్ట్- విమానాలు, రైళ్లు రద్దు