By: Ram Manohar | Updated at : 03 Aug 2023 05:16 PM (IST)
సర్వే చేయడాన్ని సవాలు చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. (Image Credits: ANI)
Gyanvapi Mosque Case:
సుప్రీంకోర్టులో పిటిషన్
జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వేకి అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. తీర్పుకి వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసింది. మసీదులో సర్వేని అడ్డుకోవాలని మసీద్ కమిటీ తరపున న్యాయవాది కోర్టుకి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం "పరిశీలిస్తాం" అని సమాధానమిచ్చింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఈమెయిల్ కూడా పంపినట్టు మసీద్ కమిటీ తరపున అడ్వకేట్ నిజాం పాషా వెల్లడించారు. ఇటు హిందువుల వైపు నుంచి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఎలాంటి తీర్పు ఇవ్వకూడదని పిటిషనర్ రాఖీ సింగ్ కోర్టుని కోరారు. ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
The Anjuman Intezamia Masjid Committee moves Supreme Court challenging the Allahabad High Court order allowing ASI to conduct a scientific survey by ASI of the Gyanvapi mosque premises.
Advocate of the Masjid Committee mentions the matter before Supreme Court saying not to allow… pic.twitter.com/R6GgpLGVY4— ANI (@ANI) August 3, 2023
జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వేకి అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. ASI సర్వే చేయొచ్చని తీర్పునిచ్చింది. ఈ సర్వే చేయడాన్ని సవాలు చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ని తోసిపుచ్చిన న్యాయస్థానం...సర్వేకి అనుమతినిచ్చింది. నిజానికి జులై 21వ తేదీనే ASI సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు ఆదేశించింది. అది మసీదా లేకపోతే ఆలయమా తేలాలంటే ఈ సర్వే చేయాల్సిందేనని ఓ మహిళ వేసిన పిటిషన్ ఆధారంగా ఈ తీర్పునిచ్చింది. జులై 24న సర్వే మొదలైనా...మసీదు కమిటీ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన కారణంగా స్టే విధించాల్సి వచ్చింది. ఈ సర్వే కారణంగా మసీదు నిర్మాణం పాక్షికంగా దెబ్బ తింటుందని, అక్కడ తవ్వడం వల్ల కూలిపోయే ప్రమాదమూ ఉందని వాదించింది మసీదు కమిటీ. అయినా ఇలాంటి ప్రాంతాల్లో సర్వే చేయడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది Anjuman Intezamia Masjid Committee. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం...అంతకు ముందు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. న్యాయం జరగాలంటే కచ్చితంగా ఈ సర్వే జరపాల్సిందే అని స్ఫష్టం చేసింది. ఈ తీర్పుపై స్పందించిన యూపీ డిప్యుటీ సీఎం కేశవ్ ప్రసాద్... ఈ తీర్పుతో త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ సర్వేని రేపటి నుంచే (ఆగస్టు 4) మొదలు పెట్టనున్నారు.
Allahabad HC allows ASI to conduct survey of Gyanvapi mosque complex in Varanasi
— ANI Digital (@ani_digital) August 3, 2023
Read @ANI Story | https://t.co/4WQcnhxeTR#AllahabadHC #Gyanvapi #ASI #gyanvapisurvey pic.twitter.com/0Ubv9B8YCA
Also Read: Haryana Clashes: హరియాణాలో మహిళా జడ్జ్ కార్‌పై రాళ్ల దాడి, కాల్పులు - తృటిలో తప్పిన ప్రాణాపాయం
Jaahnavi Kandula: జాహ్నవి కందులను హేళన చేసిన అధికారి సస్పెండ్, వెల్లడించిన సియాటెల్ పోలీసులు
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
Law Commission: లైంగిక కార్యకలాపాల సమ్మతి వయస్సును 16 ఏళ్లకు తగ్గించవద్దు, కేంద్రానికి లా కమిషన్ నివేదిక
Bank CEO Quits: క్యాబ్ డ్రైవర్ అకౌంట్‌లోకి 9వేల కోట్లు - ఆ బ్యాంకు సీఈవో రాజీనామా!
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>