No Religion No Caste: ఆ సర్టిఫికెట్ కావాలి - రాష్ట్ర ప్రభుత్వం, అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో మహిళ పిటిషన్
No Religion No Caste Certificate: తనకు 'మతం లేదు, కులం లేదు' సర్టిఫికేట్ జారీ చేయాలని కోరుతూ ఓ మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అందుకు గల కారణాలను తన పిటిషన్‌లో వివరించారు.
Gujarat Woman Moves HC seeking No Religion No Caste Certificate: సమాజంలో కులం, మతం అంటూ కొందరి చేష్టలతో అవతలి వ్యక్తులకు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొందరు అవమానాల్ని భరించలేక కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇదే విధంగా సూరత్‌కు చెందిన 36 ఏళ్ల మహిళ తనకు 'మతం లేదు, కులం లేదు' సర్టిఫికేట్ (No Religion No Caste Certificate) జారీ చేయాలని కోరుతూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తాను కోరిన సర్టిఫికెట్ ఇవ్వాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, సూరత్ జిల్లా కలెక్టర్, జునాగఢ్‌లోని చోర్వాడ్ నగర్ పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు.
ఆమె ఎవరంటే..
పిటిషనర్ కాజల్ గోవింద్‌భాయ్ మంజుల (36) (Kajal Govindbhai Manjula) రాజ్‌గోర్ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినవారు. 'వివక్షాపూరిత కుల వ్యవస్థ కారణంగా ఆమె తన జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని' ఈ ఏడాది మార్చి 30 న దాఖలు చేసిన పిటిషన్‌లో కాజల్ మంజుల పలు ఆరోపణలు చేశారు. జీవితంలో ఇక ఎలాంటి సమస్యలు, అవమానాలు ఎదుర్కోకూడదంటే తనకు ఆ సర్టిఫికేట్ పరిష్కారమని, తనను నో రిలీజియన్ నో క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేయాలని అధికారులను, ప్రభుత్వాన్ని ఆదేశించాలని.. తన న్యాయవాది ధర్మేష్ గుర్జార్ సాయంతో గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. స్నేహ ప్రతిభారాజా మతపరమైన గుర్తింపు రద్దు చేసి నో రిలీజియన్, నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆలోచించి న్యాయం చేయాలని రిక్వెస్ట్..
అనాథలు, ఒంటరి మహిళలు సైతం భవిష్యత్తులో ఎక్కడా తన ఉపకులం, కులం, మతం గురించి ప్రస్తావించే అవసరం లేకుండా చేయాలని పిటిషనర్ హైకోర్టుకు విన్నవించుకున్నారు. కేవలం తనను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా.. ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకుని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలన్నారు. 'మతం లేదు, కులం లేదు' అనే సర్టిఫికెట్‌తో అన్యాయం, అవమానాలకు గురవుతున్న వారికి సమాధానం దొరికేలా చేయాలని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. భవిష్యత్తులో తాను మరెక్కడా తన మతం, కులానికి సంబంధించి ఎలాంటి వాటిని ఉపయోగించుకోనని కాజల్ మంజుల కోర్టుకు స్పష్టంచేశారు.
గతంలో ఇంటిపేరు తొలగింపు..
గతంలో ఆమె తన ఇంటి పేరును తొలగించుకున్నారు. తన ఇంటిపేరు 'షిలు'ని తొలగించాలని గుజరాత్ ప్రభుత్వ గెజిట్‌కు దరఖాస్తు చేసుకోగా, 2021 ఆగస్టులో గెజిట్ విడుదల కావడంతో ఈ మేరకు సర్టిఫికేట్ జారీ చేశారని పేర్కొన్నారు. కొత్త గెజిట్ ఆధారంగా ఇంటి పేరు లేకుండా కేవలం ఆమె పేరుతోనే గుర్తింపు పత్రాలు, కార్డులు పొందినట్లు గుజరాత్ హైకోర్టుకు విన్నవించుకున్నారు. తాజా పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు ఏ తీర్పు చెబుతుందోనని రాష్ట్రం మొత్తం ఈ అంశంపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Also Read: Mamata Banerjee: మోదీ సర్కార్‌పై దీదీ సమర శంఖారావం- భాజపాయేతర పార్టీలు, సీఎంలకు లేఖలు
Also Read: Sri Lanka Emergency: రాత్రికి రాత్రే శ్రీలంకలో ఎమర్జెన్సీ - అందుకు దారితీసిన పరిస్థితులు ఇవే