Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా
Hardik Patel Resign: గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హార్థిక్ పటేల్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Hardik Patel Resign: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ పీసీసీ చీఫ్‌గా ఉన్న యువనేత హార్థిక్ పటేల్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. ఆ లేఖను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
ఎన్నికలకు ముందు
గుజరాత్ అసెంబ్లీకి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో పాటీదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌గా మారింది.
2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు హార్దిక్. అయితే కొద్ది రోజులుగా పార్టీ విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బహిరంగంగానే విమర్శించారు. కానీ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను మాత్రం హార్థిక్ సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. కానీ పార్టీకి రాజీనామా చేసినట్లు బుధవారం ఆయనే స్వయంగా ప్రకటించారు.
హార్థిక్ పటేల్‌ను పార్టీలోనే ఉండాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా కోరినట్లు సమాచారం. అయినప్పటికీ హార్థిక్ రాజీనామాకే మొగ్గు చూపినట్లు ఆయన సన్నిహత వర్గాలు తెలిపాయి. అయితే హార్దిక్ ఏ పార్టీలో చేరతారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. భాజపాలో చేరతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.