చంద్రయాన్ 3 సక్సెస్‌కి గుర్తుగా ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే, అధికారికంగా ప్రకటించిన కేంద్రం
National Space Day: చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్‌కి గుర్తుగా ఆగస్టు 23ని నేషనల్ స్పేస్ డేగా కేంద్రం ప్రకటించింది.
National Space Day:
జాతీయ అంతరిక్ష దినోత్సవం..
చంద్రయాన్ 3 సక్సెస్‌కి ( Chandrayaan-3 Mission) గుర్తుగా ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా (National Space Day) అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శాస్త్రవేత్తల కృషిని గౌరవిస్తూ ఈ ప్రకటన చేశారు. ఇప్పుడు అధికారికంగా అందుకు సంబంధించిన గెజిట్‌ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ఉపరితలంపై సేఫ్‌గా ల్యాండ్ అయింది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపింది. ప్రస్తుతం స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. అయినా...రోవర్ పని పూర్తైందని, అది మేల్కోకపోయినా నష్టం ఏమీ లేదని ఇస్రో స్పష్టం చేసింది.
Government of India declares August 23 of every year as 'National Space Day' to commemorate the success of the Chandrayaan-3 Mission on 23rd August 2023 with the landing of the Vikram lander and deployment of the Pragyaan Rover on the lunar surface. pic.twitter.com/5BSXJH5LCO
— ANI (@ANI) October 14, 2023
ఏ దేశానికీ సాధ్యం కాని ఫీట్ ను సాధించింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా నిలిచి చరిత్ర సృష్టించింది. భారతీయులను గర్వపడేలా చేసిన ఆగస్టు 23వ తేదీని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. బ్రిక్స్ శిఖారాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రధాని.. ఆగస్టు 26న బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ లో శాస్త్రవేత్తలను కలిసి స్వయంగా అభినందించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత అంతరిక్షణ పరిశోధనా సంస్థ - ఇస్రో చరిత్ర సృష్టించిన ఆగస్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంతరిక్షణ దినోత్సవం (నేషనల్ స్పేస్ డే)గా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే.. చంద్రయాన్-3కి చెందిన విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రాంతాన్ని శివశక్తిగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే చంద్రుడిపై చంద్రయాన్-2 జ్ఞాపకాలను వదిలి వెళ్లిన ప్రాంతాన్ని తిరంగాగా నామకరణం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
ఈ నెల 22న చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం అయింది. అప్పటి నుంచి స్లీప్ మోడ్‌లో ఉన్న రోవర్ ప్రజ్ఞాన్, లాండర్ విక్రమ్‌తో శాస్త్రవేత్తలు అనుసంధానమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. శివశక్తి పాయింట్ వద్ద సూర్యకాంతి రాకతో వాటిని తిరిగి కార్యాచరణలోకి తీసుకురావడానికి ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువం చంద్రయాన్-3 దిగిన ప్రాంతంలో సూర్యోదయం జరిగిందని, బ్యాటరీలు రీఛార్జ్ చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని ఇస్రో తెలిపింది. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో మళ్లీ కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ల్యాండర్, రోవర్ పనిచేయడానికి అవసరమైన వేడిని అందజేసే సూర్యోదయం అవసరమని ఇస్రో తెలిపింది.
Also Read: ఇజ్రాయేల్‌కి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ బంద్, అప్పటి వరకూ సర్వీస్‌లు రద్దు