బుర్కాలు వేసుకుని కాలేజ్‌కి వెళ్లిన స్టూడెంట్స్, అనుమతించని సెక్యూరిటీ - గేట్ ఎదుటే నిరసనలు
Burqa Controversy: ముంబయిలో ఓ కాలేజ్ బుర్కా వేసుకుని వచ్చిన విద్యార్థులను అనుమతించకపోవడం వివాదాస్పదమైంది.
Burqa Controversy:
బుర్కా వివాదం..
ముంబయిలో బుర్కా వివాదం కాసేపు అలజడి సృష్టించింది. బుర్కా ధరించి కాలేజ్‌కి వచ్చిన విద్యార్థులను యాజమాన్యం అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. ఎందుకు రానివ్వడం లేదంటూ ఆ యువతులకు కాలేజ్ ఎదుటే నిరసన వ్యక్తం చేశారు. ఆ తరవాత వాళ్ల తల్లిదండ్రులూ కాలేజ్‌కి వచ్చారు. గొడవ పెద్దది కావడం వల్ల పోలీసులూ రంగంలోకి దిగారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...చెంబూర్‌లోని ఓ కాలేజ్ సెక్యూరిటీ గార్డ్‌లు బుర్కాలు వేసుకుని వచ్చిన విద్యార్థులను లోపలకి అనుమతించలేదు. బుర్కాలు తీస్తేనే లోపలికి వెళ్లనిస్తాం అని తేల్చి చెప్పారు. కాలేజ్ యునిఫామ్ వేసుకోకుండా ఇలా వస్తే ఎలా అని ప్రశ్నించారు. అందుకు ఆ ముస్లిం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ పడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వివాదం పెద్దదైంది. తల్లిదండ్రులు, పోలీసులు కాలేజ్‌కి వచ్చాక కానీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. తల్లిదండ్రులతో, కాలేజీ యాజమాన్యంతో పోలీసులు మాట్లాడారు. బుర్కాలు తీయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ స్కార్ఫ్‌లను మాత్రం క్లాస్‌రూమ్‌లలో అలాగే ఉంచుకుంటామని చెప్పారు యువతులు. ఇందుకు కాలేజీ యాజమాన్యం అంగీకరించింది. క్లాసెస్‌కి వెళ్లే ముందు బుర్కాలు తీసి వెళ్లాలని చెప్పింది. అలా ఈ గొడవ సద్దుమణిగింది.
హైదరాబాద్‌లోనూ.
హైదరాబాద్‌లోనూ జూన్‌లో హిజాబ్ వివాదం కాసేపు కలకలం రేపింది. కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన ముస్లిం విద్యార్థినులను కాలేజ్ సిబ్బంది లోపలికి వెళ్లనివ్వబోమని చెప్పడం వివాదానికి దారితీసింది. పలువురు ముస్లిం విద్యార్థినులు డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్షకు హిజాబ్ ధరించి వచ్చారు. అయితే. పరీక్షా కేంద్రంలోకి వారిని కాలేజీ సిబ్బంది అనుమతించడానికి నిరాకరించింది. హిజాబ్‌తో రావద్దని సూచించారు. అలా చెప్పడంతో విద్యార్థినులకు, కాలేజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం తలెత్తింది. వారితో గొడవెందుకనుకున్న కొంతమంది విద్యార్థినులు హిజాబ్ తీసేసి పరీక్షలు రాశారు. మరికొంతపెద్దలకు చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి కాలేజీ యాజమాన్యం హిజాబ్‌తోనే విద్యార్థినులను పరీక్షకు అనుమతించారు.
అరగంటపాటు తమను ఆపేశారని గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదని విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత రోజు నుంచి హిజాబ్ లేకుండానే రావాలని కాలేజ్ యాజమాన్యం చెప్పడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన ముస్లిం మహిళలకు హిజాబ్ అనేది సర్వసాధారణమని పరీక్షా కేంద్రంలోకి హిజాబ్‌తో విద్యార్థినులను అనుమతించకపోవడంపై విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని అన్నారు. హిజాబ్ తో పరీక్షలు రాయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎవరి డ్రెస్సింగ్‌నైనా ఆహార్యాన్నైనా గౌరవించాలని, . తలనుంచి పాదాల వరకు కప్పి ఉంచే దుస్తుల విషయంలో గొడవ తగదని అన్నారు . అమ్మాయిలు ఏ దుస్తులు వేసుకున్నా సమస్య కాదు… అయితే పొట్టి దుస్తులు వేసుకోవడంతోనే సమస్యలు కొన్ని సందర్బాలలో వస్తున్నాయని అన్నారు.
Also Read: Haryana Clashes: హరియాణాలో ఇంకా తగ్గని అలజడి, ఇంటర్నెట్ సర్వీస్‌లు బంద్