By: ABP Desam | Updated at : 25 May 2023 03:44 PM (IST)
జర్మనీ - రెసెషన్ ( Image Source : Pixabay )
Germany Recession:
ఐరోపా, అమెరికాకు బ్యాడ్‌న్యూస్! ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడం మొదలైంది. ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, జర్మనీ రెసెషన్‌లోకి జారుకుంది. వరుసగా రెండో క్వార్టర్లోనూ ఆ దేశ జీడీపీ కుంచించుకుపోయింది. క్యాలెండర్ ఇయర్లో సవరించిన ధరల ప్రకారం స్థూల జాతీయ ఉత్పత్తి 0.3 శాతానికి పడిపోయింది. 2022లోని చివరి మూడు నెలల్లోనూ జీడీపీ 0.5 శాతానికి పడిపోవడం గమనార్హం.
జర్మనీ ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే ప్రధాన కారణం! అతి తక్కువ ధరకు క్రూడాయిల్, గ్యాస్‌ను ఎగమతి చేసే రష్యాపై ఆంక్షలు విధించడం వారికి చేటు చేసింది. కూర్చున్న కొమ్మనే నరికేసినట్టు మారింది! ఆర్థిక శాస్త్రం ప్రకారం వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ కుంచించుకుపోతే ఆర్థిక మాంద్యం వచ్చినట్టుగా భావిస్తారు. ముందుగా అంచనా వేసిన సున్నా శాతాన్ని ఈ త్రైమాసికంలో నెగెటివ్ గ్రోత్ కిందకు ఫెడరల్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ సవరించింది.
ఐరోపా మొత్తానికీ రష్యానే అతిపెద్ద చమురు, గ్యాస్ ఎగుమతిదారు! ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధానికి దిగిన వెంటనే.. అమెరికా చెప్పిందని.. తమ పరిస్థితులను అంచనా వేసుకోకుండా రష్యాపై ఆంక్షలు విధించారు. అప్పటికే చెల్లించాల్సిన కోట్ల డాలర్లను ఫ్రీజ్ చేశారు. దాంతో పుతిన్ వీరికి చమురు, గ్యాస్ ఎగుమతి చేయడం ఆపేశారు. దాంతో ఐరోపా మొత్తం గగ్గోలు పెట్టింది. సాధారణంగా 30-35 డాలర్లకే కొనుగోలు చేసే బ్యారెల్ ముడిచమురును ఇప్పుడు 100-110 డాలర్లు పెట్టి కొనాల్సి వస్తుంది. అందులోనూ వీరికి ఇతర దేశాలు చమురును ఇవ్వడం లేదు. డిమాండ్ తగ్గుతోందని కొన్నాళ్ల క్రితమే సౌదీ నేతృత్వంలోని ఓపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించేశాయి.
యుద్ధ పరిణామాలతో ఐరోపాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ గృహ వినియోగం 1.2 శాతానికి పడిపోయింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఆరంభం నాటి అంచనాలతో పోలిస్తే రెసెషన్ పరిణామాలు ఇంకా స్వల్పంగానే ఉన్నాయని అంటున్నారు. అయితే వాతావరణం చల్లగా ఉండటం, కొవిడ్ తర్వాత సప్లై చైన్ అంతరాలు పూర్తిగా తొలగిపోక పోవడంతో జర్మనీ ఎకానమీ రెసెషనరీ డేంజర్ జోన్ నుంచి బయటపడే అవకాశమే లేదని ఐఎన్‌జీ బ్యాంకు మాక్రో హెడ్ కార్‌స్టెన్ బ్రెజ్‌స్కీ తెలిపారు.
విచిత్రంగా 2023లో తొలి మూడు నెలల్లో జర్మనీలో పెట్టుబడులు పెరిగాయి. వాణిజ్య పరంగానూ సానుకూల సరళి కనిపిస్తోంది. కరోనా వైరస్ రావడంతో 2020లో చివరిసారి జర్మనీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. వైరస్ ఉద్ధృతిని ఆపేందుకు ఎకానమీ మొత్తం మూసేయడమే ఇందుకు కారణం. ఇప్పుడు గ్యాస్, చమురు చవకగా దొరికితే తప్ప దీన్నుంచి బయటపడే దారులు కనిపించడం లేదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్‌పూర్‌లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!
Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం
Odisha Train Accident LIVE: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో భారీగా ప్రాణ నష్టం! ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం
Wrestlers Protest: 'బ్రిజ్ భూషణ్‌ను జూన్ 9లోగా అరెస్టు చేయాలి, లేకుంటే భారీ ఉద్యమం తప్పదు'
Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?