G20 Summit 2023 LIVE: బ్రెజిల్ ప్రెసిడెంట్‌కి G20 అధ్యక్ష బాధ్యతలు, గ్యావెల్ అప్పగించిన ప్రధాని మోదీ
G20 Summit Delhi LIVE Updates: G20 సదస్సుకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ని ఫాలో అవ్వండి.

Background
G20 Summit 2023 LIVE:
G20 సదస్సులో తొలిరోజే ఆసక్తికర పరిణామం జరిగింది. సదస్సుని ప్రారంభిస్తూ ప్రసంగించిన ప్రధాని మోదీ చివర్లో కీలక ప్రకటన చేశారు. G20లో ఆఫ్రికన్ యూనియన్ (African Union)కు శాశ్వత సభ్యత్వం కల్పించారు. సభ్యులందరి ఆమోదంతో ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్టు ప్రధాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ చీఫ్ అజాలీ అసౌమనీని (Azali Assoumani)ఆలింగనం చేసుకున్నారు. స్వయంగా తానే పర్మినెంట్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోబెట్టారు. దీనిపై అజాలీ ఆనందం వ్యక్తం చేశారు. సబ్‌కా సాథ్ నినాద స్ఫూర్తితోనే ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నట్టు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
"సబ్‌కా సాథ్ నినాదం స్ఫూర్తితో ఆఫ్రికన్ యూనియన్‌కి G20 లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం. ఇందుకు సభ్యులందరూ ఆమోదం తెలుపుతున్నారనే విశ్వసిస్తున్నాను. మీ అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నాం. మనం చర్చలు మొదలు పెట్టే ముందు AU ప్రెసిడెంట్ అజాలీ ఆయన స్థానంలో కూర్చోవాలని కోరుకుంటున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ G20 సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొరాకోలో భూకంప విపత్తులో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డవాళ్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ కష్టకాలంలో మొరాకో దేశానికి ఎలాంటి సాయమైనా అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. మోదీ కూర్చున్న స్థానంలో ముందు నేమ్‌ప్లేట్ ఆసక్తికరంగా మారింది. దానిపై India కి బదులుగా Bharat అని రాసుంది. పేరు మార్పుపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై ఆ పేరు కనిపించింది. విపక్షాలు దీనిపై ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండి పడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో భారత్ అని కనిపించడం వల్ల కేంద్రం అందుకు సిద్ధంగానే ఉందని సంకేతాలిచ్చినట్టైంది.
#WATCH | G 20 in India | PM Modi at the G 20 Summit says "Before we start the proceedings of G20, I want to express my condolences over the loss of lives due to an earthquake in Morocco. We pray that all injured recover at the earliest. India is ready to offer all possible… pic.twitter.com/ZTqcg11cKI
— ANI (@ANI) September 9, 2023
భారత్ మండపంపై బ్యాగ్రౌండ్ లో ఆకట్టుకునే రీతిలో కోణార్క్ చక్రాన్ని ఏర్పాటు చేశారు. దానిపై ఒక వైపు జీ20 ఇండియా 2023 అని మరోవైపు వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ- వన్ ఫ్యూచర్ అనే అక్షరాలను రాసుకొచ్చారు. ఈ ప్రత్యేక ఏర్పాటు అతిథులను భలేగా ఆకట్టుకుంటోంది. మధ్యలో అశోక చక్రాన్ని ప్రతిబింబించేలా కోణార్క్ చక్రాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేశ సంస్కృతిని ప్రతిబింబించే అనేక చిహ్నాలను ఈ మండపం వద్ద ఏర్పాటు చేశారు. వాటిల్లో ఈ చక్రం కూడా ఒకటి. ఈ చక్రం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టిని కూడా ఆకర్షించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జో బైడెన్ కు ఈ చక్రం ప్రాముఖ్యతను వివరించి చెప్పారు. కోణార్క్ చక్రాన్ని 13వ శతాబ్దంలో నరసింహదేవ-1 పాలనలో నిర్మించారు. ఇది భ్రమణం, సమయం, పురోగతి, నిరంతర మార్పును సూచిస్తుంది. ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతాలు, సమాజ పురోగతి కోసం నిబద్ధతకు గుర్తుగా నిలుస్తోంది. 13వ శతాబ్దంలో నిర్మించిన కోణార్క్ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని, వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్నా అద్భుత శిల్ప సౌందర్యంతో ఆకట్టుకుంటోంది. చిన్నారుల నుంచి యవ్వనంలో ఉండేవారికి, మలిసంధ్యలో ఉన్నవారికి ఇలా ఓ వ్యక్తి జీవితంలో వివిధ దశలకు సంబంధించిన విఙ్ఞానాన్ని అందిస్తోంది కోణార్క్ ఆలయం.
బ్రెజిల్ ప్రెసిడెంట్‌కి గ్యావెల్
వచ్చే ఏడాది G20 సమావేశాలు బ్రెజిల్‌లో జరగనున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌కి Gavel అందించారు. అధికారికంగా బాధ్యతలు అప్పగించారు.
#WATCH | G 20 in India | Prime Minister Narendra Modi hands over the gavel of G 20 presidency to the President of Brazil Luiz Inácio Lula da Silva. pic.twitter.com/ihEmXN9lty
— ANI (@ANI) September 10, 2023
ఖలిస్థాన్ ఉద్యమంపై చర్చ!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ సెషన్‌లో ఖలిస్థాన్ ఉద్యమం గురించి ప్రస్తావించారు. యూకే ప్రధాని రిషి సునాక్‌తో దీనిపై చర్చించినట్టు సమాచారం.






















