Sunil Jakhar Joins BJP: కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు- భాజపాలోకి మరో సీనియర్ నేత
Sunil Jakhar Joins BJP: కాంగ్రెస్ నుంచి మరో సీనియర్ నేత సునీల్ జాఖడ్ భాజపాలో చేరారు.
Sunil Jakhar Joins BJP: 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. గుజరాత్ యువనేత హార్థిక్ పటేల్ రాజీనామా మరువకముందే మరో సీనియర్ నేత పార్టీకి దూరమయ్యారు. పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ జాఖడ్ భాజపాలో చేరారు. భాజపా జాతీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జాఖడ్ ఆ పార్టీలో చేరారు.
Former Congress leader Shri @sunilkjakhar joins BJP in presence of BJP National President Shri @JPNadda at party headquarters in New Delhi. #JoinBJP pic.twitter.com/LuS44MgieK
— BJP (@BJP4India) May 19, 2022
అంతకుముందు
ఇటీవల జాఖడ్.. కాంగ్రెస్ పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌బుక్ లైవ్‌లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు.
విదేశాలకు రాహుల్
ఓవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతుంటే మరోవైపు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాలకు బయల్దేరారు. రాహుల్ గాంధీ లండన్‌లో శుక్రవారం జరిగే 'ఐడియాస్ ఫర్ ఇండియా' సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా భారత సంతతి ప్రజలతో దేశ ప్రస్తుత, భవిష్యత్తు పరిణామాలపై ఆయన మాట్లాడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Also Read: Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు
Also Read: Krishna Janmabhoomi Row: శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా తొలగింపుపై పిటిషన్- విచారణకు కోర్టు ఓకే