By: ABP Desam | Updated at : 23 Apr 2022 02:48 PM (IST)
మహారాష్ట్ర రాజకీయాల్లో హనుమాన్ చాలీసా కలకలం
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా అంటే మనం త్వరగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ తెలుగు మాజీ హీరోయిన్ నవనీత్ కౌర్ అంటే సులువుగా గుర్తుపడతారు. ఆమె ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఇండిపెండెంట్‌గా అమరావతి ఎంపీ సీటులో గెలవడమే కాదు... ఇప్పుడు నేరుగా శివసేననే ఢీ కొడుతున్నారు. మహారాష్ట్ర సీఎం నివాసం అయిన మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని సవాల్ చేశారు. దీనికి కారణం ఉంది.. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో భయానక వాతావరణం పెరిగిందని, అందుకే "మాతో శ్రీ " ఎదుట హనుమాల్ చాలీసా పఠిస్తానని సవాల్ చేశారు.
Mumbai | They (MLA Ravi Rana and MP Navneet Rana) have challenged the law and order situation. They were prompted to do this by someone. Shiv Sena workers are here to protect 'Matoshree'. Police are taking care of the situation: Shiv Sena leader Anil Desai outside 'Matoshree' pic.twitter.com/AiqFVbxnCZ
— ANI (@ANI) April 23, 2022
నవనీత్ కౌర్ భర్త రవి రానా కూడా ఎమ్మెల్యేనే. ఆయనతో కలిసి హనుమాన్ చాలీసా పఠించేందుకు వెళ్లక ముందే శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ముంబైలోని వారింటిముందు ఆందోళనకు దిగారు. శివసేనతో పోరాడుతూండటంతో కేంద్రం ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది.
రానా దంపతులకు అధికార శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివసేనను సవాల్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మహారాష్ట్రలో మీరు ప్రశాంతంగా గడపలేరంటూ శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ హెచ్చరించారు.
Will Shiv Sainiks sit quietly if someone from outside says that they'll come &chant Hanuman Chalisa at 'Matoshree'? If you try to come to our residence,then we also have the right to answer in the same language. Don't give us threats of imposing President's Rule here: Sanjay Raut pic.twitter.com/SLa1xZ4VUO
— ANI (@ANI) April 23, 2022
మరో వైపు సీఎం నివాదం మాతోశ్రీ వద్ద కూడా పెద్ద ఎత్తున శివసైనికులు గుమికూడారు. సీఎం ఇంటివద్ద గలాటా సృష్టించడానికి ఎవరైనా వస్తే ఎలా బుద్ది చెప్పాలో తమకు తెలుసని వారంటున్నారు.
Maharashtra | We are waiting, we'll keep Hanuman Chalisa in front of us. We're waiting to teach them a lesson: Former Mumbai Mayor & Shiv Sena leader Kishori Pednekar outside 'Matoshree' in Mumbai pic.twitter.com/HX4vcUIe9F
— ANI (@ANI) April 23, 2022
మహారాష్ట్ర రాజకీయాల్లో నవనీత్ కౌర్ , రవిరానా దంపతుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రానా దంపతులు ప్రతిష్ఠించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ తొలగించింది. ఈ విషయంలో శివసేన ప్రభుత్వంతో వివాదాలు వచ్చాయి. అవి అలా కొనసాగుతూనే ఉన్నాయి. నేరుగా ధాకరే కుటుంబాన్నే టార్గెట్ చేస్తూండటంతో నవనీత్ కౌర్ పైర్ బ్రాండ్ ఎంపీగా పేరు తెచ్చుకుంటున్నారు.
Anil Baijal Resign: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా- ఇదే రీజన్!
Naval Anti-ship Missile: యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం- వీడియో చూశారా?
Gyanvapi Masjid: 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు
Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్లో ఉన్న దేశం అదే
Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!
YSRCP Rajya Sabha: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు