(Source: ECI/ABP News/ABP Majha)
Corona Third Wave: త్వరలో కరోనా థర్డ్ వేవ్.. ఇలా చేస్తే తప్పదు భారీ మూల్యం!
ఇదిగో థర్డ్ వేవ్.. అదిగో థర్డ్ వేవ్ వస్తుంది అంటూ వచ్చిన పుకార్లతో జనాలు వణికిపోయారు. అయితే అతి త్వరలో థర్డ్ వేవ్ రానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా రెండో వేవ్ తర్వాత.. కొన్ని రోజులకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో థర్డ్ వేవ్ వస్తుందంటూ.. అంచనాలు వేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. తాజాగా శాస్త్రవేత్తలు థర్డ్ వేవ్ కు సంబంధించి.. వార్నింగ్ ఇచ్చేశారు. భారత్లో కొవిడ్ ముప్పు తొలగిపోలేదని.. మూడో ముప్పు ప్రభావం 103 శాతం వరకు ఉండొచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పండగ సీజన్లలో ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి పెరిగితే కష్టమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇష్టం వచ్చినట్టు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
జర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్ లో ప్రచురితమైన అధ్యయనపత్రంలో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. పర్యాటకుల సంఖ్య పెరగటం.. సామాజిక.. రాజకీయ.. మతపరమైన అంశాలతో ప్రజలు పెద్ద ఎత్తున గుమి గూడుతున్నారని.. ఇవన్నీ మూడో వేవ్ కు కారణాలుగా చెబుతున్నారు. ఇటీవల పర్యాటకుల తాకిడి పెరిగిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ .. మనాలి.. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లలో కేసులు పెరుగుతున్న విషయాన్ని ఉదాహరణగా చెబుతున్నారు.
ఈ నెల నుంచి కేసులు.. క్రమంగా పెరుగుతూ.. వచ్చే జనవరి-ఏప్రిల్ మధ్య అది తీవ్రస్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఇంటాబయట అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు సూచించారు. శాస్త్రవేత్తలు సందీప్ మండల్, నిమలన్ అరినమిన్‌పతి, బలరాం భార్గవ, శమిరణ్ పాండాలు రాసిన అధ్యయన పత్రం.. 'జర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్'లో ప్రచురితమైంది. పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం, సామాజిక-రాజకీయ-మతపరమైన కారణాలతో ప్రజలు పెద్దఎత్తున గుమికూడటం వంటివి మూడో ఉద్ధృతికి దారితీయొచ్చని చెప్పారు.
తాజాగా పబ్లిష్ అయిన అధ్యయనపత్రంలో పేర్కొన్న అంశాల్ని చూస్తే..
- దేశీయంగా పర్యాటకం పెరిగితే వ్యాపారులకు.. స్థానికులకు మంచి జరుగుతుంది. కానీ.. పర్యాటకులు.. స్థానికులు.. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- హోటళ్లలో.. కేఫ్ లలో ఎక్కువసేపు మాట్లాడుకోవటం.. షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవటం.. లాంటివి కారణంగా మూడో ముప్పు అధికమయ్యే అవకాశం ఉంది.
- కొవిడ్ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా.. పర్యాటకుల తాకిడి లేకుంటే మూడో వేవ్ తీవ్రత కొంతమేర తగ్గే వీలుంది. సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగితే మాత్రం మహమ్మారి సులువుగా వ్యాపించే వీలుంది.
- దేశంలో జనసాంద్రతఎక్కువ. కాబట్టి మూడో వేవ్ కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసుల పెరుగుదల 103 శాతం ఉండొచ్చు.
- హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. కరచాలనం చేసుకోవడం వంటి చర్యలతో ముప్పు ఇంకా పెరుగుతుంది.
- కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అందరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందడుగు వేయడం సాధ్యమవుతుంది.
Also Read: Potpourri: కొబ్బరి డొక్క, దానిమ్మ తొక్క.. ఇవే రూమ్ ఫ్రెషనర్లు... ఇప్పుడిదే సరికొత్త ట్రెండ్
Also Read:Curry leaf: కరివేపాకును తీసిపడేయకండి... షుగర్ కు చెక్ పెట్టే దమ్మున్న ఆకు ఇది
Also Read: New Study: కరోనా వల్ల కొత్త సమస్య... సంతానోత్పత్తిపై కూడా ప్రభావం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి