ఎమోజీలు ఇప్పుడు చాలా పెద్ద సమస్య- సలాం వెంకీ లాంటి చిత్రాలు రావాలి- నటి రేవతి
విడాకుల గురించి మాట్లాడటానికి సంకోచిస్తున్న టైంలో మౌన రాగం వంటి చిత్రంలో నటించానన్నారు నటి రేవతి. ఆ సినిమా తన మనసుకు చాలా దగ్గరైన సినిమా అభివర్ణించారు.
రైజ్ ఆఫ్ ద సౌత్' అనే అంశంపై ఏబీపీ నిర్విహిస్తున్న 'ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2023'లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ రోజు (అక్టోబర్ 12) చెన్నైలో జరుగుతున్న ఈ సమ్మెట్‌లో సినిమా, రాజకీయాల్లో మహిళల పాత్ర, 2024 లోక్ సభ ఎన్నికలపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సినీ పరిశ్రమలో తన 40 ఏళ్ల అనుభవాన్ని నటి, దర్శకురాలు రేవతి పంచుకున్నారు.
మనసుకు దగ్గరగా మౌనరాగం: రేవతి
రేవతి తన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేస్తూ ''మౌన రాగం మణిరత్నం 4వ చిత్రం. ఆ సినిమా చెప్పగానే నటించడానికి సిద్ధమయ్యాను. ఎందుకంటే, విడాకుల గురించి మాట్లాడటానికి విముఖత చూపిన ఆ రోజుల్లో మౌనరాగం లాంటి సినిమాలో నటించడం సాహసమే. ఆ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. నేను నటించిన చిత్రాల్లో మౌన రాగం చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత చాలా కమర్షియల్ సినిమాల్లో నటించాను. అయితే అవన్నీ ఒకెత్తైతే... మౌన రాగం అనే ఒక ఎత్తైన సినిమాగా ఉంది.
'మౌనరాగం' సినిమా అప్పట్లో చేయడానికి ఎవరూ ఇష్టపడలేదని ప్రముఖ నటి, దర్శకురాలు రేవతి అన్నారు. తన కెరీర్‌లో 'మౌనరాగం' చాలా రియలిస్టిక్‌గా ఉన్న సినిమా అని చెప్పారు. 1986లో విడుదలైన తమిళ రొమాంటిక్ మూవీ 'మౌనరాగం'. మణిరత్నం దర్శకత్వం వహించగా, జి.వెంకటేశ్వరన్ దీన్ని నిర్మించారు.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో మహిళల విషయానికొస్తే కథ, సినిమా మేకింగ్, కాస్ట్యూమ్స్ అన్నీ మారిపోయాయి. అందుకు తగ్గట్టుగానే చిత్ర పరిశ్రమ మారిపోయింది. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అందుకే నేను నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఉంటూ వచ్చాను. చాలా భాషలు నేర్చుకోగలిగాను. కానీ, నాకు మలయాళం, తమిళం అనర్గళంగా రాదు. అయినా సమయం తీసుకుని వాటిని నేర్చుకున్నాను.
ఇళయరాజా పాటలంటే ఇష్టం:
తమిళ సినిమాల్లో నాకు ఇష్టమైన పాటల్లో ఇళయరాజా పాటలు ప్రధానమైనవి. చాలా మంది మహిళలకు ఏ పాత్ర సరైనదో తెలుసుకోవడం కష్టం. కానీ సరైన పాత్రను ఎంచుకుంటే ఎదగొచ్చు.
80వ దశకంలో పాపులర్ అయిన దర్శకుడు భారతీరాజానే నన్ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అందుకే నేను ఎదగగలిగాను. "మీరు కథను, పాత్రను అర్థం చేసుకోవాలి" అని ఆయన చెబుతూ సినిమా గురించి చాలా నేర్పించారు. నేను సినిమా నేపథ్యం నుంచి రాలేదు కాబట్టి ఆయన సూచనలు సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు నమ్మకం ముఖ్యం. దర్శకులు విశ్వసనీయంగా ఉంటే సమస్య లేదు. కమల్ హాసన్, శివాజీ తదితరులతో నటించాను. 'ఖైదీయిన్ డైరీ', 'పున్నగై మన్నన్' చిత్రాల ద్వారా వారిద్దరితో కలిసి పని చేసే అవకాసం నాకు కలిగింది. భారతీయ సినిమాలోని నటులు, నటీమణులకు డాన్స్ చేయడం చాలా అవసరం. ఫైట్ తెలియాలి. నటిగా ఫైట్ సీన్ ఉన్న సినిమాల్లో నటించాను. అది కూడా అవసరమే' అని అన్నారు.
ఫిల్మ్ మేకింగ్ అంటే ఫ్యాషన్: రేవతి
ఫిల్మ్ మేకింగ్ అంటే తనకు చాలా ప్యాషన్ అని నటి రేవతి చెప్పారు. తన మొదటి సినిమా చేయడానికి తనకు 18 ఏళ్లు పట్టాయని చెప్పారు. తాను దర్శకురాలిగా మారాలని అనుకోలేదని, అయితే, అది ఇప్పుడే సాద్యమైందని పేర్కొన్నారు. టూత్ ప్యారీ, నెట్ ఫ్లిక్స్ సిరీస్‌లో నటిగా తనకు సవాల్ విసిరినట్లు వెల్లడించారు.
'సలామ్ వెంకీ' వంటి కథలు చెప్పాల్సిన అవసరం ఉంది: రేవతి
తల్లీ కొడుకుల అనుబంధాన్ని తెలిపే 'సలామ్ వెంకీ' వంటి కథలు చెప్పాల్సిన అవసరం ఉందని రేవతి అన్నారు. 2022లో కాజోల్, విశాల్ జెత్వాతో కలిసి రేవతి ఈ చిత్రంలో నటించారు. ఆమెనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొవిడ్ మహమ్మారి తర్వాత చాలా బాధను చూపిస్తూ ఈ సినిమా ఎందుకు తీశారని తనను చాలా మంది ప్రశ్నించినట్లు రేవతి చెప్పారు.
ఎమోజీలు చాలా పెద్ద సమస్య: రేవతి
ప్రస్తుత కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎమోజీలు చాలా పెద్ద సమస్య అని రేవతి అన్నారు. అవి తప్పుడు అర్థాన్ని వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. తాము ప్రొఫెషనల్‌గా మాట్లాడేటప్పుడు ఎమోజీలను ఉపయోగించలేమని వెల్లడించారు. తాను ధైర్యంగా బయటకొచ్చి మాట్లాడగలిగే కుటుంబంలో పుట్టానని తన బాల్యం గురించి ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు.