అన్వేషించండి

Vijay Deverakonda: లవ్ లైఫ్ గురించి పబ్లిగ్గా చెప్పిన విజయ్ దేవరకొండ... ప్రేమలో పడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందేనట

Vijay Deverakonda Love Story: లవ్ గురించి విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. ప్రేమలో పడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే అని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో ఫేమ్ ఒక్కటే కాదు రూమర్స్ కూడా సర్వసాధారణం. ఆన్ స్క్రీన్ రొమాన్స్ బాగున్నా, నటీనటులకు ఒకరితో ఒకరికి మంచి బాండింగ్ ఉన్నా సరే ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ గుప్పుమంటాయి. ఇప్పుడున్న హీరోల్లో అలా రూమర్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలిచే హీరోలలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. తాజాగా ఆయన ప్రేమ గురించి చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ గా మారాయి.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నాడంటూ ఎప్పటి నుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ వాళ్లిద్దరూ ఈ విషయంపై ఎప్పుడూ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రేమ గురించి ఆయన చేసిన కామెంట్స్ గురించి చర్చ నడుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా 'సాహిబా' (Sahiba Song) అనే మ్యూజిక్ ఆల్బమ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 'హీరీయే' అనే సాంగ్ తో ఓవర్ నైట్ క్రేజ్ దక్కించుకున్న సింగర్, మ్యూజిక్ కంపోజర్ జస్లీన్‌ రాయల్‌ ఈ 'సాహిబా' ఆల్బమ్ ను రూపొందించింది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, ఆయనకు జోడిగా రాధిక మదన్ కనిపించింది. 

రీసెంట్ గా ఈ ఆల్బమ్ ను రిలీజ్ చేయగా, ప్రస్తుతం రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తోంది. అయితే 'సాహిబా' ఆల్బమ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ప్రస్తుత తరానికి లవ్ విషయంలో ఒక విలువైన సలహా ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఆ వైరల్ వీడియోలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ "ప్రేమ అనేది ఖచ్చితంగా పుడుతుంది. అబ్బాయిలు మీరు ఇంకా యంగ్ గానే ఉన్నారు. కాబట్టి కాస్త టైం ఇవ్వండి. ముందుగా అబ్బాయిలు ఎదగాలి. ఇదేం అంతా చెడ్డ విషయం కాదు. ప్రేమ విషయంలో కొంచెం టైం ఇవ్వాలి. 30 ఏళ్లు దాటిన అబ్బాయిలు, 20 ఏళ్ల అబ్బాయిల కంటే బెటర్ గా ఆలోచిస్తారు. ఇది పర్సనల్ గా నా అనుభవం. 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు మనం ఏదీ డిసైడ్ చేసుకోలేం. కానీ టైం వచ్చినప్పుడు అన్నీ వాటంతట అవే జరుగుతాయి. అందుకే దేనినీ ఫోర్స్ ఫుల్ గా చేయకండి" అంటూ లవ్ గురించి విజయ్ దేవరకొండ సలహా ఇచ్చారు. అయితే విజయ్ దేవరకొండ కామెంట్స్ విన్న అభిమానులు ఆయన చెప్పింది కూడా నిజమే కదా అని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటిదాకా ఈ సినిమాలో శ్రీలీల, రష్మిక మందన్న పేర్లు విన్పించగా, తాజాగా ఆయన కొత్త హీరోయిన్ తో ఫ్రెష్ గా జోడీ కట్టబోతున్నాడు అనే టాక్ నడుస్తోంది. మరి ఈసారి విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేయబోతున్న హీరోయిన్ ఎవరో చూడాలి.

Read Also : Hyper Aadi: నేను ఎప్పుడు రోజా గారిని ఏమీ అనలేదు... జబర్దస్త్ అంటే అంత చులకనా? - 'కేసీఆర్‌' ఈవెంట్‌లో హైపర్ ఆది కామెంట్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget