అన్వేషించండి

Hyper Aadi: నేను ఎప్పుడు రోజా గారిని ఏమీ అనలేదు... జబర్దస్త్ అంటే అంత చులకనా? - 'కేసీఆర్‌' ఈవెంట్‌లో హైపర్ ఆది కామెంట్స్‌

రోజా గురించి ఏదో అన్నానని యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ పెడుతున్నారని.. ఆమెను ఇప్పటి వరకు ఏం అనలేదన్నారు ఆది. ఇక మీదట కూడా ఏం అనబోనన్నారు.

Hyper Aadi About RK Roja: ‘జబర్దస్త్’ రాకేష్ హీరోగా నటించిన ‘KCR’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, రోజాతో పాటు జానీ మాస్టర్‌, శివ బాలాజీ, సుధీర్‌, ఆది, చంటితో పాటు పలువురు ‘జబర్దస్త్’ కమెడియన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

నేను రోజాను ఏమీ అనలేదు!

రోజా గురించి తాను ఎప్పుడూ ఏమీ అనలేదన్నారు. కానీ, కొంత మంది ఏదో అన్నట్లు వార్తలు రాస్తున్నారని చెప్పారు. “చాలా రోజుల తర్వాత రోజా గారిని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బేసిక్ గా యూట్యూబ్ లో చాలా మంది రోజాని హైపర్ ఆది ఏమన్నాడో తెలుసా? అంటూ రాస్తుంటారు. నేను ఇంతవరకు ఆమెని ఏమి అనలేదు. అసలు అనను కూడా. అయినా సరే ఎదో అన్నట్టు రాస్తారు. సరే రాసుకొండి. మీ వ్యూస్ కోసం ఎదో ఒకటి రాయాలి కాబట్టి” అని హైపర్ ఆది అన్నారు.

‘పుష్ప 2’తో అంతర్జాతీయ స్థాయికి అల్లు అర్జున్   

తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరుగుతుందన్నారు ఆది, “తెలుగు సినిమా ఇప్పుడు చాలా బాగుంది. పుష్ప సినిమాతో తెలుగు సినిమా వైభవం పెరుగుతుంది. ‘పుష్ప 2’ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సారి ఇంటర్నేషనల్‌ స్థాయిలో సత్తా చాటుతాడు. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడం, ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ రూ. 1000 కోట్ల సినిమాలు, పవన్ కల్యాణ్ వంద శాతం స్ట్రయిక్ రేట్ తో పాన్ ఇండియా పొలిటీషన్ కావడం సంతోషంగా ఉంది. తెలుగు ఆడియెన్స్ చాలా గొప్ప వాళ్లు. దీపావళికి వచ్చిన మూడు చిత్రాలను హిట్ చేశారు. ‘లక్కీ భాస్కర్‌’కు ఒక్క నెగెటివ్ రివ్యూ కూడా రాలేదు. ‘అమరన్’ చూసి కంటతడి పెట్టుకున్నారు. కిరణ్ అబ్బవరం ‘క’ హిట్ అందుకున్నారు. ఈ సినిమా కంటే ముందు కిరణ్ అబ్బవరం ఏం చేసినా ట్రోల్ చేసే వాళ్లు, ఆయన ఇప్పుడు నడిస్తే ట్రెండ్ అవుతోంది. అలాంటి పరిశ్రమలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది” అన్నారు.

‘జబర్దస్త్’ ఆర్టిస్టులను చులకనగా చూడకండి!

‘జబర్దస్త్’ నుంచి వచ్చిన వాళ్లెందరో ఉన్నత స్థానాలకు వెళ్లారని చెప్పారు ఆది. “వేణుని ఓ స్కిట్ కారణంగా ఫిల్మ్ ఛాంబర్ దగ్గర కొట్టారు. అలాంటి వేణు ‘బలగం’ సినిమా తీసి ఎక్కడ అవమానానికి గురయ్యాడో, అక్కడే సన్మానం పొందాడు. ‘జబర్దస్త్’కు ఓ గౌరవం తీసుకొచ్చాడు. ‘జబర్దస్త్’ నుంచి ఎంతో మంది కళాకారులు వచ్చారు. కానీ కొందరు  ‘జబర్దస్త్’ గురించి చులకనగా మాట్లాడుతున్నారు. ఇంత చెప్పినా మీరు ఇంకా  చులకనగా మాట్లాడితే.. ఊడేదేం లేదు” అన్నారు.  

రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్ జంటగా నటించిన ‘KCR’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సినిమాకు ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించారు. రాకేష్ ఈ సినిమాను నిర్మించారు.  

Read Also: మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Jani Master: త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
Embed widget