అన్వేషించండి

India - China Border Issue: గ్రేట్ ఇండియన్ ఆర్మీ, గల్వాన్ లోయలో భారత సైనికుల పోరాటంపై మంత్రి జై శంకర్ ప్రశంసలు

EAM Jaishankar: 2020లో లడఖ్ లోని గల్వాన్ లోయలో చైనా దాడుల సందర్భంగా మన సైనికులు అద్భుతంగా పోరాడారని, ధైర్యసాహసాలు ప్రదర్శించారని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కొనియాడారు. 

EAM S Jaishankar: చైనాతో ఇండియాకు కొన్ని చోట్ల సరిహద్దు సమస్యలున్నాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ మంగళవారం లోక్ సభలో తెలిపారు. నిజానికి ఇరుదేశాల మధ్య వాస్తవ సరిహద్దు రేఖ (ఎల్ఏసీ) ఉందని, అయితే కొన్ని చోట్ల ఈ రేఖకు సంబంధించి ప్రాంతాలపై అభిప్రాయ బేధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక చర్చల ద్వారానే సరిహద్దు కు సంబంధించిన అంశాలను పరిష్కారం చేసుకుంటామని వెల్లడించారు. 
ఎల్ఏసీలో కొన్ని ప్రాంతాల సరిహద్దుకు సంబంధించి ఇరుపక్షాలలో కామన్ అవగాహన లేదని పేర్కొన్నారు. ఈక్రమంలో చైనాతో చర్చల ద్వారా దీనిపై పరిష్కారానికి  కృషి చేస్తామని వెల్లడించారు. మరోవైపు సరిహద్దులో శాంతి, స్థిరత్వం లేకుండా రెండు దేశాల మధ్య రిలేషన్ష్ సాధారణంగా ఉండలేవని చైనాకు చెప్పినట్లు జై శంకర్ పునరుద్ఘాటించారు. వీటికి సంబంధించి తమకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందని, న్యాయపరమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఆ దేశంతో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 

అక్సాయ్ చిన్ ఆక్రమణ..
1962 యుద్ధం ముగిశాక లడఖ్ ప్రాంతంలోని అక్సాయ్ చిన్ లోని 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని వివరించారు. , ఇక మరో 5180 చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించిన దాయాది పాకిస్తాన్.. ఈ ప్రాంతాన్ని చైనాకు ధారదత్తం చేసిందని విదేశాంగ మంత్రి జై శంకర్ ఆరోపించారు. 

2020లో మన ఆర్మీ గొప్పగా పోరాడింది..
ఇక 2020లో తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో చైనా దళాలు ఆక్రమణకు పూనుకోగా, మన సైనిక దళాలు సమర్థంగా తిప్పికొట్టాయని జై శంకర్ ప్రశంసించారు. ఆ సమయంలో సవాలుతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ సైన్యం గొప్పగా పోరాడిందన్నారు. అప్పటికే కోవిడ్ 19 ఒకవైపు, లాజిస్టిక్ సమస్యలు మరోవైపు ఇబ్బంది పెట్టినా మన సైనిక దళాలు ఏమాత్రం వెనుకంజ వేయకుండా, ప్రత్యర్థి దళాల దాడులను సమర్థంగా తిప్పికొట్టాయని కొనియాడారు. 

Also Read: Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కృషితో..
మరోవైపు చైనాతో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ జరిపిన సంప్రదింపులు కూడా ఫలప్రదమయ్యాయని జై శంకర్ కొనియాడారు. చైనా రక్షణ మంత్రి డోంగ్ జున్ తో లావోస్ లో జరిగిన 11వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశంలో  రాజనాథ్ సింగ్ చర్చించారు. ఆ చర్చల తర్వాత వివాదస్పద సరిహద్దు వద్ద రక్షణ దళాలను వెనక్కి రప్పించాలని తీర్మాణించాయి. దీంతో 2020కి ముందున్నట్లుగానే ప్రస్తుత పరిస్థితి నెలకొంది. 

ఇరుదేశాల సంయక్త పహారా..

తూర్పు లడఖ్ లోని డెంచోక్, డెస్పాంగ్ ప్రాంతాలలో వారానిక ఒకసారి రెండు దేశాలకు చెందిన సైన్యం కలిసి పహారా కాయాలని నవంబర్ లో ఒక అవగాహనకు వచ్చాయి. ఈ క్రమంలో నవంబరులో ఉమ్మడిగా ఈ కార్యక్రమాలు నిర్వహించాయి. అనంతరం వారానికి ఒకసారి ఒక్కో దేశానికి చెందని సైనిక దళం పహారా కాయాలనే నిర్ణయానికి వచ్చాయి. రెండు దేశాలకు సంబంధించి పలు మంత్రిత్వ శాఖలు పలు దఫాలుగా చర్చలు జరపడంతో ప్రస్తుతానికి శాంతియుత వాతావరణం నెలకొంది. 

 

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget