Drone Mahotsav 2022: దేశంలో డ్రోన్ల సాంకేతికతతో సరికొత్త విప్లవం: మోదీ
Drone Mahotsav 2022: డ్రోన్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. డ్రోన్ల సాంకేతికత సరికొత్త విప్లవం తీసుకొచ్చిందన్నారు.
Drone Mahotsav 2022: దిల్లీలో రెండు రోజుల పాటు జరిగే డ్రోన్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. భారత్‌లో డ్రోన్ల సాంకేతికత సరికొత్త విప్లవం తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వాలు సాంకేతికత వినియోగం పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లిందని మోదీ అన్నారు.
దిల్లీలో మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు భారత్ డ్రోన్ మహోత్సవ్-2022 జరుగుతోంది. ఈ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతో పాటు పౌర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సహా పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. వీరితో పాటు డ్రోన్ల అంకుర సంస్థలు పాల్గొననునన్నాయి.
Also Read: Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి
Former Haryana CM: మాజీ సీఎంకు 4 ఏళ్ల జైలు శిక్ష- అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పు