Harop Drones : పాకిస్తాన్‌లో విధ్వంసం సృష్టించిన 'హారోప్' డ్రోన్‌ల గురించి తెలుసా ?
Harop Drones : ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) అభివృద్ధి చేసిన HAROP నెక్ట్స్ జనరేషన్‌కు చెందిన ఆయుధ వ్యవస్థ. ఇది మానవరహిత వైమానిక వాహన (UAV) సామర్థ్యం కలిగి ఉంది పేలుడు సామగ్రి తీసుకెళ్లగలదు.

Harop Drones : భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయడంతో ఇండియన్ ఆర్మీ తీవ్రంగా స్పందిస్తోంది. పాకిస్థాన్ మిసైల్స్‌కో విరుచుకుపడేందుకు యత్నిస్తే వాటిని విజయవంతంగా భారత్ ఆర్మీ తిప్పికొట్టింది. ఎస్ 400 రక్షణ వ్యవస్థతో దేశాన్ని కాపాడటంలో విజయవంతమైంది. దీనికి ప్రతిగా భారత్ కూడా దాడులు చేసింది. కేవలం భారత్ ఆర్మీలో ఉన్న డ్రోన్ వ్యవస్థతోనే పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో విధ్వంసం సృష్టించింది.
కొన్నింటిని పాకిస్థాన్ కూల్చేసినప్పటికీ మరికొన్ని అనుకున్నట్టుగానే పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడి చేయగలిగాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ కూడా అంగీకరించింది. "పాకిస్తాన్ గగనతలంలోకి భారత డ్రోన్‌లను పంపుతోంది ఈ దురాక్రమణకు భారీ మూల్యం చెల్లించుకుంటుంది" అని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి హెచ్చరించారు.
ఆపరేషన్ సిందూర్ కింద భారత దళాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది మౌలిక సదుపాయాల ప్రదేశాలను నాశనం చేసిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది. గురువారం భారతదేశం HAROP డ్రోన్‌లను ఉపయోగించిందని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. భారత్ సైనిక స్థావరాలను టచ్ చేసేందుకు ప్రయత్నంచడం తోనే ఈ చర్యకు పాల్పడినట్టు భారత్ ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన మిసైల్ శకలాలను కూడా సరిహద్దుల్లో లభిస్తున్నట్టు వివరించింది.
హారోప్ అంటే ఏమిటి?
ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) అభివృద్ధి చేసిన HAROP నెక్స్ట్స జనరేషన్ విధ్వంసక వ్యవస్థ. ఇది మానవరహిత వైమానిక వాహనాల (UAV) కెపాసిటీని కలిగి ఉంటుంది. కొట్టాల్సిన టార్గెట్‌ను ఫిక్స్ చేసి ప్రోగ్రామింగ్ రన్ చేస్తే పేలుడు సామగ్రి తీసుకెళ్లి నాశనం చేస్తుంది.
హారోప్ డ్రోన్‌ల శ్రేణి?
హారోప్ 20 కిలోల పేలుడు పదార్థాలు మోసుకెళ్లగలదు. ఏడు గంటల వరకు గాలిలో ఉండగలదు. దీనికి 200 కిలోమీటర్ల పరిధి ఉంది. సంచరించే మందుగుండు సామగ్రిగా దీన్ని పిలుస్తారు. ఇది లక్ష్యాలను గుర్తించగలదు, శత్రు భూభాగాలపై తిరుగుతూ వాటిని హిట్ చేయగలదు.
గత పదేళ్లలో భారతదేశం ఇజ్రాయెల్ నుంచి $2.9 బిలియన్ల విలువైన సైనిక పరికరాలను దిగుమతి చేసుకున్నట్లు TRT గ్లోబల్ నివేదికను గుర్తు చేసేతూ ఇండియా టీవీ రాసుకొచ్చింది. ఇటీవలి కాలంలో భారతదేశం, అజర్‌బైజాన్ ఈఊ డ్రోన్ వ్యవస్థను కొనుగోలు చేశాయి.
హరోప్ డ్రోన్‌లు కావాల్సినప్పుడు ఆపేయొచ్చు, రీస్టార్ట్ చేయొచ్చు
యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా హరోప్ డ్రోన్లను ఆపరేట్ చేయవచ్చు. దాడి వద్దనుకుంటే వెనక్కి తీసుకోవచ్చు. నిశ్చలంగా ఉంచవచ్చు. మళ్లీ దాన్ని కావాల్సినప్పుడు రన్ చేసేందుకు వీలు ఉంటుంది. నష్టాన్ని తగ్గించి శత్రువులకు హెచ్చరికలు పంపడానికి ఇలాంటి దాడులు చేస్తారు. ఇప్పుడు కూడా భారత్ అదే పని చేసిందని అంటున్నారు.
హరోప్‌ను సీలు చేసిన డబ్బాలాంటి వస్తువుల నుంచి ప్రయోగించవచ్చు. ఇది డిప్లోయ్ చేయడం చాలా సులభం. నిఘా వ్యవస్థను తప్పించుకొని శత్రువు స్థావరాలకు వెళ్లగలదు. పరిస్థితుల అవగాహన, ఆయుధ పరిష్కారాన్ని కలిగి ఉంటుంది.
HAROP డ్రోన్‌లు ఎలక్ట్రో-ఆప్టికల్ (EO), ఇన్‌ఫ్రారెడ్ (IR), ఫార్వర్డ్-లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ (FLIR) సెన్సార్‌లతో అమర్చి ఉంటాయి. ఇది కలర్ CCD కెమెరా, యాంటీ-రాడార్ హోమింగ్ సామర్థ్యాలు కలిగి ఉంది. ఇది హరోప్‌కు సమగ్రతను తీసుకొస్తుంది. అందుకే దీన్ని ఇప్పుడు భారత్ ప్రయోగించింది. తక్కువ విధ్వంసం చేస్తూనే పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చేందుకు ఈ డ్రోన్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.





















