వర్షాకాలంలో సోలార్ ప్యానెల్స్ పని చేయవా? నిజమెంత? మీ సందేహాలకు సమాధానాలు, విద్యుత్ ఉత్పత్తిపై పూర్తి సమాచారం!
Can Solar Panels Work Without Sun: ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ద్వారా ఇచ్చే సోలార్ ప్యానెల్స్ చలికాలంలో, వర్షాకాలంలో పని చేస్తాయా? అలా పని చేయాలంటే ఏం చేయాలి?

Can Solar Panels Work Without Sun: కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన(PM Suryodaya Yojana) ద్వారా భారతదేశంలో రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షల కుటుంబాలు సోలార్ విద్యుత్ వినియోగిస్తున్నాయి. అయితే, వర్షాకాలం (మాన్సూన్), చలికాలంలో ఈ సోలార్ ప్యానెల్స్ పని చేస్తాయో లేదో అన్న సందేహం చాలా మందిలో ఉంది. సూర్యుడు ఉంటే కదా పని చేస్తాయి... వర్షా కాలంలో రోజులో ఎక్కువ భాగం సూర్యుడు కనిపించడు ఎండ రాదు కాబట్టి ఈ సోలార్ ప్యానెల్స్ పని చేస్తాయా అనే అనుమానం ఉంది.
వర్షాకాలంలో సోలార్ ప్యానెల్స్ పనితీరు
సాధారణంగా సోలార్ ప్యానెల్స్ సూర్యకాంతిని విద్యుత్‌గా మార్చుతాయి. వర్షాకాలంలో మేఘాలు, వర్షం కారణంగా సూర్యకాంతి చాలా తక్కువగా భూమిపైకి వస్తుంది. అయినా సరే సోలార్ ప్యానెల్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. మేఘాల ద్వారా వచ్చే డిఫ్యూస్ కాంతిని విద్యుత్‌గా మార్చుతాయి.
సాధారణంగా సూర్య కాంతి ఎక్కువ కనిపించే రోజులతో పోల్చుకుంటే మాత్రం సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వర్షాలు పడే రోజుల్లో అంటే సూర్యకాంతి రాని రోజుల్లో సోలార్ ప్యానెల్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధారణంగా పదిశాతం నుంచి 20 శాతానికి పడిపోతుంది. సూర్యుడు ప్రకాశవంతంగా ఉండే రోజుల్లో అది 30 శాతం నుంచి 50శాతం వరకు ఉంటుంది.
వర్షాకాలంలో సోలార్ ప్యానెల్స్ పనితీరు
మరోవైపు చలికాలంలో సూర్యకాంతి ప్రసరించే సమయం తక్కువగా ఉంటుంది. సోలార్ ప్యానెల్స్‌కు ఉష్ణోగ్రత అవసరం లేదు. కేవలం సూర్యకాంతి అవసరం. చల్లటి వాతావరణంలో విద్యుత్ ప్రవాహం మెరుగ్గా జరుగుతుంది, పనితీరు కొంత మెరుగుపడుతుంది. మంచు పడే ప్రాంతాల్లో ప్యానెల్స్‌పై మంచు ఉండిపోతే విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. కానీ మంచు కరిగిన తర్వాత లేదా శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ సాధారణంగా పనిచేస్తాయి.
వర్షాకాలం, చలికాలంలో సూర్యకాంతి ప్రసరించే సమయం తగ్గిపోతుంది. అందుకే దీని వల్ల విద్యుత్ ఉత్పత్తి మొత్తం పడిపోతుంది. కానీ బ్యాటరీ స్టోరేజ్ ఉంటే ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చు.
నాణ్యమైన ప్యానెల్స్ వాడటం అవసరం
మరోవైపు వర్షాకాలంలో గాలి ఎక్కువగా వీయడం వల్ల తక్కువ నాణ్యత ఉన్న మౌంటింగ్‌లు, ఇన్‌స్టాలేషన్ లోపాలు వల్ల ప్యానెల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. IS 875, ASCE 7 వంటి ప్రమాణాలు అనుసరించే స్ట్రాంగ్‌గా ఉండే మౌంటింగ్ స్ట్రక్చర్లు ఉపయోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. 150–170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా సోలార్ ప్యానల్స్ తట్టుకోగలవు.
బ్యాటరీ స్టోరేజ్ బాగుంటే వర్షం, మబ్బులు, చలికాలంలో కూడా నాణ్యమైన విద్యుత్ పొందవచ్చు. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ సోలార్ ప్యానెల్స్ వర్షం, తేమ, గాలి, మంచు వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా తయారు చేస్తున్నారు. బలమైన మౌంటింగ్, నాణ్యమైన ఇన్‌స్టాలేషన్, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటే, ప్యానెల్స్‌కు ఎక్కువ నష్టం ఉండదు. విద్యుదుత్పత్తి కూడా తగ్గిపోకుండా ఉంటుంది. ప్యానెల్స్‌పై నాచు పెరగకుండా క్లీన్ చేయడం చాలా అవసరం. అవసరమైతే యాంటీ మైక్రోబియల్ కోటింగ్‌లు వేయడం ఉత్తమం.
వర్షాలు పడటం వల్ల ప్యానెల్స్‌పై ఉన్న దుమ్ము, మురికి క్లీన్ అవుతుంది. దీనివల్ల సూర్యకాంతిని ఆకర్షించే సామర్థ్యంలో మెరుగవుతుంది. వర్షాకాలం చలికాలంలో అవసరమైన విద్యుత్ కోసం పూర్తిగా సోలార్‌పై ఆధారపడకుండా ఉంటే మంచిది. అదనంగా బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్‌లు ఇన్‌స్టాల్ చేస్తే కూడా సమస్యను బయటపడొచ్చు.
వర్షాకాలం, చలికాలంలో రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పని చేయవనేది అపోహ మాత్రమే. సమర్థవంతంగా పనిచేస్తాయి. వర్షంలో విద్యుత్ ఉత్పత్తి కొంత తగ్గినా, ప్యానెల్స్ పూర్తిగా ఆగిపోవు. నాణ్యమైన ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్ ఉంటే ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సోలార్ విద్యుత్ అందుబాటులో ఉంటుంది.





















