Delhi road rage: షాకింగ్ వీడియో- రోడ్డుపై వాగ్వాదం, బైకర్‌ను ఢీ కొట్టిన స్కార్పియో డ్రైవర్!
Delhi road rage: ఓ బైకర్‌ను స్కార్పియో వాహనంతో ఢీ కొట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Delhi road rage: దిల్లీకి చెందిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రోడ్డుపై వెళ్తున్న ఓ బైకర్‌ను స్కార్పియో వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆ బైకర్ కిందపడిపోయాడు. హెల్మెట్ ధరించడంతో ఆ బైకర్ సురక్షితంగా బయటపడ్డాడు.
#WATCH | A man hit a biker with his four-wheeler following a heated verbal exchange with the biker group, near Arjan Garh metro station in Delhi. (05.06)
— ANI (@ANI) June 6, 2022
Police say they've taken cognisance of the matter & investigation is on.
(Note: Abusive language)
(Source: Biker's friend) pic.twitter.com/ZHXdGil95z
ఇదీ జరిగింది
దిల్లీలోని అర్జాన్‌ఘర్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై వెళ్తున్న బైకర్ల గ్యాంగ్‌తో స్కార్పియో వాహనంలో వెళ్తున్న డ్రైవర్‌కు వాగ్వాదం జరిగింది. అయితే ఎంతకూ ఇది ఆగకపోవడంతో స్కార్పియో డ్రైవర్ తన వాహనంతో ఓ బైకర్‌ను ఢీ కొట్టాడు. దీంతో ఆ బైకర్ కిందపడిపోయాడు. ఆ తర్వాత స్కార్పియో డ్రైవర్ వేగంగా వెళ్లిపోయాడు.
ఈ ఘటన మొత్తాన్ని మరో బైకర్ తన హెడ్‌గేర్ కెమెరాతో చిత్రీకరించాడు. ఆదివారం ఈ ఘటన జరిగింది. గాయపడ్డ బైకర్‌ను 20 ఏళ్ల శ్రేయాన్ష్‌గా గుర్తించారు. ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌పై ట్రిప్‌కు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
@PMOIndia @ArvindKejriwal @DCPNewDelhi
— ANURAG R IYER (@anuragiyer) June 5, 2022
Please help us , the Scorpio Car driver almost killed a few of our riders and threatened to kill us by crushing us under the car.
This is not what we vote for or pay taxes for
no one was severely injured
Gears respect riders pic.twitter.com/rcZIZvP7q4
స్పందన
ఘటనపై దిల్లీ పోలీసులు వెంటనే స్పందించారు. స్కార్పియో డ్రైవర్‌ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సుమోటోగా విచారణ చేపట్టినట్లు తెలిపిన పోలీసులు బైకర్లను రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాలని వెల్లడించారు. ఫతేపుర్ బేరీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు.
Also Read: Kerala Norovirus: కేరళలో మరో వైరస్ కలకలం- ఇద్దరు చిన్నారుల్లో లక్షణాలు!
Also Read: Corona Cases: దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు- కొత్తగా 4,518 మందికి వైరస్