ఇకపై వాట్సాప్‌లోనూ మెట్రో టికెట్ బుక్ చేసుకోవచ్చు, అందుబాటులోకి కొత్త సర్వీస్
Delhi Metro Tickets: ఢిల్లీలో వాట్సాప్‌లోనూ మెట్రో టికెట్స్ బుక్ చేసుకునే సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
Delhi Metro Tickets:
ఢిల్లీ మెట్రోలో...
మెట్రో సర్వీస్‌లు వచ్చాక సిటీల్లో ట్రావెలింగ్ కష్టాలు తీరిపోయాయి. రోడ్లపై ట్రాఫిక్ కూడా కొంత వరకూ తగ్గింది. రోజూ లక్షలాది మంది మెట్రోల్లో ప్రయాణిస్తున్నారు. డిమాండ్‌కి తగ్గట్టుగా సర్వీస్‌లు పెంచుతున్నారు అధికారులు. టికెట్ బుకింగ్‌ని కూడా మరింత సులభతరం చేస్తున్నారు. ప్రస్తుతానికి పలు డిజిటల్ వ్యాలెట్‌లలో టికెట్ బుకింగ్ సౌకర్యం ఉంది. దీంతో పాటు వాట్సాప్‌లోనూ మెట్రో టికెట్‌లు బుక్ చేసుకునేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఢిల్లీ మెట్రో (Delhi Metro). PeLocal Fintech Private Limitedతో కలిసి ఢిల్లీ మెట్రో ఈ సర్వీస్‌ని లాంఛ్ చేసింది. ప్రస్తుతానికి ట్రయల్‌లో ఉంది. ఢిల్లీ మెట్రో ఎమ్‌డీ డాక్టర్ వికాస్ కుమార్ ఈ సర్వీస్‌ని లాంఛ్ చేశారు. వాట్సాప్‌లో మెట్రో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో వివరించారు. ఢిల్లీలో కొన్ని స్టేషన్లకు మాత్రమే ఈ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీ, శివాజీ స్టేడియం, ఢిల్లీ ఏరో సిటీ, ద్వారకా సెక్టార్ 21 లాంటి స్టేషన్లకు వాట్సాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే మిగతా స్టేషన్లకూ ఈ సర్వీస్‌ని విస్తరించనున్నారు.
ఎలా బుక్ చేసుకోవాలి..?
9650855800 అనే నంబర్‌కి Hi అని వాట్సాప్ చేయాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. హిందీ లేదా ఇంగ్లీష్‌ని ఎంచుకోవచ్చు. ఆ తరవాత "Buy Ticket" ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అక్కడే సోర్స్, డెస్టినేషన్ స్టేషన్‌ల వివరాలు ఇవ్వాలి. ఒకవేళ అప్పటికే బుక్ చేసుకుని ఉంటే హిస్టరీ కూడా కిందే కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. డిటెయిల్స్‌ని కన్‌ఫమ్ చేసిన తరవాత పేమెంట్ గేట్‌వేకి వెళ్తుంది. పేమెంట్ అయిపోగానే టికెట్ QR Code కనిపిస్తుంది. వీటిని మెట్రో స్టేషన్‌లోని ఎంట్రీ గేట్స్ వద్ద స్కాన్ చేసి లోపలకు వెళ్లిపోవచ్చు.
ఢిల్లీ మెట్రోలో పాడు పనులు..
ఢిల్లీ మెట్రోలో ఓ జంట మైమరిచిపోయి ముద్దుల్లో మునిగిపోయింది. బ్లూ లైన్‌లో వెళ్లే ట్రైన్‌లో యువ జంట రెచ్చిపోయింది. ప్రియుడి ఒడిలో పడుకొని ఉన్న యువతికి ముద్దులు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకటి రెండు సార్లు కాదు... ట్రైన్ దిగే వరకు వాళ్లు అదే పనిలో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు యువకులు అసభ్యకరమైన పనులు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. రాయడానికి ఇబ్బందికరంగా అనిపించేంత అభ్యంతకరమైన పనులు చేశారు. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందికి గురి చేశారు. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలవాల్ ట్విటర్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఢిల్లీ మెట్రో అధికారులు ఏం చేస్తున్నారంటూ మండి పడ్డారు. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోలపై నెటిజన్‌లు మండిపడుతున్నారు. చుట్టూ అంత మంది ఉండి కూడా ఎందుకలా వదిలేశారంటూ అసహనానికి గురయ్యారు.