Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు - అరెస్టును సమర్థించిన కోర్టు, కీలక వ్యాఖ్యలు
Delhi Cm Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది.
Delhi High Court Suspends Kejriwal Petition: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal)కు ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి (Delhi Liquor Policy) సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని, ట్రయల్ కోర్టులో కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్ట్ చేసిందన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ కు సంబంధించి కేజ్రీవాల్ అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని.. ఆయన అరెస్టును సమర్థించింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 'సీఎంకు ఓ న్యాయం, సామాన్యులకో ఓ న్యాయం అనేది ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవు. నిందితుడి వీలుని బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదు.' అని పేర్కొంది. లిక్కర్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ తనను ఈడీ అరెస్ట్ చేయడం అక్రమమని గత వారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై, కేజ్రీవాల్ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
Delhi High Court says that the material collected by the ED reveals that Mr Arvind Kejriwal conspired with others. The ED case also reveals that he was involved in his personal capacity as well as convenor of AAP. Granting pardon to approver is not under ED's domain and is a… https://t.co/3MwWNRjI1s
— ANI (@ANI) April 9, 2024
Delhi High Court dismisses CM Arvind Kejriwal's plea challenging his arrest by the Enforcement Directorate in the Excise Policy money laundering case.
— ANI (@ANI) April 9, 2024
ED was in possession of enough material which had led them to arrest Kejriwal. Non-joining of investigation by Kejriwal, delay… pic.twitter.com/i07wwSlJiE
కాగా, లిక్కర్ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కొన్ని రోజుల పాటు ఆయన్ను ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు ఏప్రిల్ 15 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తన అరెస్టుపై సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తాజాగా ఆ పిటిషన్ కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.