Delhi New Names : మారిపోనున్న ఢిల్లీ రోడ్ల పేర్లు - బీజేపీ ప్రతిపాదిస్తున్న కొత్త పేర్లివే..!
ఢిల్లీలో రహదారులకు హిందూ వీరుల పేర్లు పెట్టాలని బీజేపీ ఆందోళనలు ప్రారంభించింది. కుతుబ్ మినార్ పేరును విష్ణు స్తంభ్‌గా మార్చాలని అంటున్నారు.
ఢిల్లీలో ముస్లిం రాజుల పాలనను గుర్తుకు తెచ్చేలా ఉండే పేర్లను మార్చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలోని అక్బర్ రోడ్, హుమయూన్ రోడ్, తుగ్లక్ రోడ్‌ల పేర్లను మార్చాలని కోరుతోతోంది. తమ డిమాండ్ నెరవేర్చాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు కూడా ప్రారంభఇంచారు. ముస్లిం పాలనను సూచించే ఈ రహదారుల పేర్లను మార్చాలని ఢిల్లీ బిజెపి చీఫ్ అదేష్ గుప్తా న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ ( NDMC)కి లేఖ రాశారు. ఏమేం పేర్లు పెట్టాలో కూడా బీజేపీ నేతలు సూచిస్తున్నారు.
తుగ్లక్ రోడ్‌ను గురు గోవింద్ సింగ్ మార్గ్‌గా, అక్బర్ రోడ్‌ను మహారాణా ప్రతాప్ రోడ్‌గా, ఔరంగజేబ్ లైన్‌ను అబ్దుల్ కలామ్ లైన్‌గా, హుమయూన్ రోడ్‌ని మహర్షి వాల్మీకి రోడ్‌గా, షాజహాన్ రోడ్‌ని జనరల్ బిపిన్ రావత్‌గా, బాబర్ లైన్‌ని స్వాతంత్య్ర సమరయోధుడు ఖుధీరామ్ బోస్‌గా మార్చాలని ఆదేశ్ గుప్తా లేఖలో కోరారు. 13 మంది సభ్యులతో కూడిన ఎన్‌డీఎంసీ ఈ లేఖను పరిశీలనకు తీసుకుంది. . దీంతో పేర్లు మార్పు ఖాయమని భావిస్తున్నారు. ఆదేశ్ గుప్తా నెలలోనూ ఆయన 40 ఊర్ల పేర్లను మార్చాలంటూ ఢిల్లీ ప్రభుత్వానికి సైతం ఒక డిమాండ్ చేశారు.
సాధారణంగా.. చరిత్ర, సెంటిమెంట్, సదరు వ్యక్తి గురించి సమాజానికి తెలియాల్సి ఉందన్న అవసరం మేరకు.. రోడ్లకు, ప్రదేశాలకు పేర్లు మార్చే అంశాన్ని పరిశీలిస్తారు. ఇక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. యూపీ, ఢిల్లీలో కొన్ని ప్రాంతాల పేర్లను మార్చింది. ఢిల్లీలోని కుతుబ్ మినార్ పేరును విష్ణు స్తంభ్‌గా మార్చాలంటూ హిందూ సంఘాలు ఆందోళనలు ప్రారభించాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన మహాకల్ మానవ్ సేవా ప్రాంతంలో ఈ సంఘం నినాదాలు చేసింది.
Delhi | Members of Hindu organisation Mahakal Manav Sewa protest near Qutub Minar, demand renaming of Qutub Minar as Vishnu Stambh pic.twitter.com/HuPsf6oakP
— ANI (@ANI) May 10, 2022
చరిత్ర, సెంటిమెంట్ ఇతర అంశాలను గుర్తించాల్సి వుందా అనే అంశాలనుపరిగణలోకి తీసుకుని పేర్లను మార్చాలని నిబంధనలు సూచిస్తున్నాయి. 2014 బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ పేర్ల మార్పు వివాదం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ పేర్ల మార్పు పలు వివాదాలకు, చర్చకు దారితీశాయి. ఇరప్పుడు ఢిల్లీలో ఆ సీన్ రిపీటవుతోంది.