Deadman Returns : అంత్యక్రియలు చేసేసిన రెండ్రోజుల్లో తిరిగొచ్చేశాడు ! నమ్మలేరా ?
తండ్రి చనిపోయాడని ఓ కుమారుడు అంత్యక్రియలు చేసేశాడు . కానీ రెండు రోజుల తర్వాత ఆ తండ్రి తిరిగి వచ్చాడు. ఇంతకీ ఏం జరిగింది ?
చనిపోయాడని అందరూ ఏడ్చేశారు. డెడ్‌బాడీని తీసుకొచ్చి అంత్యక్రియలు చేసేశారు. ఇక మనకు లేడని జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కానీ ఒక్క రోజులోనే ఆయన తిరిగి వచ్చేశారు . కానీ కలలో కాదు రియల్‌గానే. ఇలాంటి ఘటనలు సినిమాల్లోనే జరుగుతాయి. చూసే వారికి కావాల్సినంత ఫన్ కలిగిస్తాయి. అయితే నిజంగానే ఇలాంటివి అక్కడక్కడా జరుగుతూ ఉంటాయి. తాజాగా చెన్నైలోనూ జరిగింది. సినిమల్లో చూసిన అలాంటి ఘటనలు తమకే ఎదురు కావడంతో వారికి మైండ్ బ్లాంక్ అయింది. కానీ అంతిమంగా తూచ్.. అనుకోవాల్సి వచ్చింది.
ఆ బీచ్‌లో గుసగుసలు వినిపిస్తాయి, మాట్లాడేదెవరో తెలియదు, అదో మిస్టరీ
తమిళనాడులోని ( Tamilnadu ) ఈరోడ్ జిల్లాలో రోజు కూలీగా కుటుంబాన్ని పోషించుకునే మూర్తి కూలి పనికి వెళ్లి మళ్లీ రాలేదు. పని దగ్గరకు వాకబు చేస్తే వెళ్లిపోయాడని చెప్పారు. అలా రెండు , మూడు రోజులు వెదికినా కనిపించలేదు. దీంతో పోలీస్ (Police )కంప్లయింట్ ఇచ్చారు. మూడు రోజుల కిందట మూర్తి కుమారుడికి పోలీసులు ఫోన్ చేసి గుర్తు తెలియని మృతదేహం ఫలానా చోట ఉంది... చూసి మీ నాన్నదేమో గుర్తించండని అడిగారు. అలా వెళ్లిన మూర్తి ( Moorthy ) కుమారుడు ఏ గుర్తులు చూసి తన నాన్నేనని అనుకున్నాడో కానీ.. .. భోరున విలపిచేశాడు.
41 ఏళ్లు అతడు సినిమా చూపించాడు - కోర్టు తీర్పుతో సీన్ రివర్స్, కుటుంబసభ్యులు షాక్
దీంతో కూమారుడికి మూర్తి మృతదేహాన్ని అప్పగించారు. ఆయన తీసుకెళ్లి కుటుంబసభ్యులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించేశారు. తదుపరి కార్యక్రమాలు నిర్వహించడానికి ఏం చేయాలా అని చర్చలు జరుపుతున్నారు. అంత్యక్రియలు ముగిసిపోయిన రెండో రోజే ఓ వ్యక్తి ఇంటికొచ్చేశాడు. అతన్ని చూసి అందరూ జడుసుకున్నారు. నిజమేనా కలా అని గిల్లుకున్నారు. చివరికి నిజమేనని అనుకున్నారు. ఎవరంటే ఆయనే మూర్తి.
భార్యను 3 కిమీ బండిలో లాక్కెళ్లిని పెద్దాయన- అంబులెన్స్ లేక ఎండలో పాట్లు!
చనిపోయాడనుకుని అంత్యక్రియలు చేసేశారు కానీ... అక్కడ చనిపోయింది మూర్తి కాదు. విషయం తెలిసిన తర్వాత మూర్తి కుమారుడు మళ్లీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన తండ్రి చనిపోలేదని.. పొరపాటున వేరే వారి మృతదేహాన్ని తీసుకొచ్చేసి అంత్యక్రియలు చేశామని వివరణ ఇచ్చారు. అయితే పోలీసులకు ఇప్పటికీ ఓ మిస్టరీ ఉండిపోయింది.. అదేమిటంటే.. మూర్తి పేరుతో అంత్యక్రియలు చేసేసిన మృతదేహం ఎవరిది ?. అనేదే .