అన్వేషించండి

Coronavirus Updates: ఇండియాలో కొత్తగా 11,850 కరోనా కేసులు.. ఆందోళన పెంచుతున్న కొవిడ్19 బాధితుల మరణాలు

ఇటీవల పదివేలకు దిగువన నమోదుకావడంతో కొవిడ్19 వ్యాప్తి తగ్గిందని భావించాం. గడిచిన 24 గంటల్లో 11,850 కొత్త కేసులను నిర్ధారించారు. క్రితం రోజుతో పోల్చితే కొవిడ్ మరణాలు సైతం భారీగా పెరిగాయి.

India Coronavirus Updates: కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకున్నప్పటికీ దేశంలో పూర్తి స్థాయిలో నియంత్రణ జరగలేదు. ఇటీవల పదివేలకు దిగువన నమోదుకావడంతో కొవిడ్19 వ్యాప్తి తగ్గిందని భావించాం. కానీ పలు దేశాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని గమనించాలి. దేశంలోనూ కరోనా కేసులలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,850 కొత్త కేసులను నిర్ధారించారు. నిన్న ఒక్కరోజులో 555 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. క్రితం రోజుతో పోల్చితే కొవిడ్ మరణాలు సైతం భారీగా పెరిగాయి. దేశంలో ఇప్పటివరకూ 4,63,245 మంది మహమ్మారికి బలయ్యారు. 

భారత్‌లో ప్రస్తుతం 1,36,308 (ఒక లక్షా 36 వేల 308) యాక్టివ్ కేసులున్నాయి. కాగా, గత 274 రోజులలో ఇవే అతి తక్కువ క్రియాశీల కేసులు. మరోవైపు నిన్న ఒక్కరోజులో 12,403 మంది కరోనా మహమ్మారిని జయించారు. ఓవరాల్‌గా 3.44 కోట్ల మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకూ 3.38 కోట్ల మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. దాంతో కొవిడ్19 రికవరీ రేటు 98.26 శాతానికి చేరింది. కరోనా మరణాలు 1.35 శాతానికి చేరుకున్నాయి. మొత్తం కరోనా కేసులలో యాక్టివ్ కేసులు 0.40 శాతం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో ప్రకటించింది. 
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?

దేశంలో నిన్న ఒక్కరోజులో 58,42,530 (58 లక్షల 42 వేల 530) డోసుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకూ భారత్‌లో 1,11,40,48,134 (111 కోట్ల 40 లక్షల 48 వేల 134) డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ జరిగినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. దేశంలో నమోదవుతున్న కేసులలో సగానికి పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా వ్యాప్తిలో కేరళ అగ్రస్థానంలో ఉంది. అమెరికా, యూరప్ దేశాలలో కరోనా వ్యాప్తి అధికం కావడం, మరణాలు పెరగడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. థర్డ్ వేవ్ రాకుండా ఉండటంలో భాగంగా కరోనా వ్యాక్సినేషన్ వేగంగా చేస్తూనే, పరీక్షలు సైతం ఎక్కువగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: ఉప్పుతో మెదడుకు ముప్పు? షాకింగ్ విషయాలు బయటపెట్టిన తాజా అధ్యయనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
Hyderabad Outer Ring Rail Project:రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
Hyderabad Outer Ring Rail Project:రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Manchu Family Issue:  మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Ram Charan: ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్
ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్
Embed widget