![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus Cases India: దేశంలో కొత్తగా 3,805 మందికి కరోనా - అక్కడ 21 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు
India Corona Updates: భారత్‌లో వరుసగా రెండో వారం మూడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులో 3,805 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.
![Coronavirus Cases India: దేశంలో కొత్తగా 3,805 మందికి కరోనా - అక్కడ 21 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు Coronavirus Cases India: India reports 3,805 new COVID19 cases in last 24 hours Coronavirus Cases India: దేశంలో కొత్తగా 3,805 మందికి కరోనా - అక్కడ 21 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/b5dcae904844f6b9495da365afc31a14_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus Cases India: దేశంలో కరోనా వ్యాప్తి పెరగడంతో ఫోర్త్ వేవ్ ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతోంది. వరుసగా రెండో వారం మూడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాలలో కోవిడ్19 వ్యాప్తి ఆందోళనకరంగా మారుతుందని అధికారులు హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,805 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో మరో 22 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
4.8 లక్షల నిర్ధారణ టెస్టులు..
నిన్న ఒక్కరోజులో 4.8 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, మూడు వేల ఎనిమిది వందల మందికి పాజిటివ్‌గా తేలింది. దేశ రాజధాని ఢిల్లీ మూడు నెలల తరువాత గరిష్ట కేసులు నమోదయ్యాయి. నిన్న ఢిల్లీలో 1,656 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులలో ఇది దాదాపు 40 శాతంగా ఉన్నాయి. క్రితం రోజుతో పోల్చితే 21 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 5.39 శాతానికి చేరింది.
ముంబైలోనూ వరుసగా నాలుగోరోజు 100 మందిలో కరోనా వైరస్ గుర్తించారు. మహారాష్ట్రలో వరుసగా రెండో రోజు 200 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దేశంలో యాక్టివ్ కేసులు 20 వేల మార్క్ దాటాయి. మొత్తం కేసుల్లో ఇది 0.05 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్యశాఖ పేర్కొంది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలో దీని ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడి అధికారులు అప్రమత్తమై కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.
దేశంలో కొవిడ్ టీకాలు..
దేశంలో ఇప్పటివరకూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి 193 కోట్ల 53 లక్షల డోసుల కొవిడ్ టీకాలు ఇచ్చారు. ఇంకా 18.64 కోట్ల డోసుల వ్యాక్సిన్లు రాష్ట్రాల వద్ద నిల్వ ఉన్నాయి.
Also Read: Raw Food: ఈ కూరగాయలను పచ్చిగా అస్సలు తినొద్దు, ఎంత ప్రమాదమో తెలుసా?
Also Read: ప్రియుడి కండోమ్‌కు సీక్రెట్‌గా రంథ్రాలు చేసిన మహిళ, ఊహించని శిక్ష విధించిన కోర్టు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)