India Corona Cases: భారత్‌లో మళ్లీ తగ్గిన కరోనా కేసులు.. తాజాగా కొవిడ్‌తో 959 మంది మృతి
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,09,918 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే 15 వేల వరకు పాజిటివ్ కేసులు తగ్గడం కాస్త ఊరట కలిగిస్తోంది.
Covid Cases In India: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,09,918 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే 15 వేల వరకు పాజిటివ్ కేసులు తగ్గడం కాస్త ఊరట కలిగిస్తోంది. కానీ కొవిడ్19 మరణాల సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాతో పోరాడుతూ ఆదివారం 959 మంది మరణించారు. నిన్న ఒక్కరోజులో 2,62,628 మంది కోలుకున్నారు.
దేశంలో నిన్న ఒక్కరోజులో 2,62,628 (2 లక్షల 62 వేల 628) మంది కరోనాను జయించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,268కు దిగొచ్చింది. భారత్‌లో కరోనా యాక్టివ్ కేసులు చాలా రోజుల తరువాత క్రితం రోజుతో పోల్చితే బాగానే తగ్గాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది.
భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 166.03 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద దాదాపు 14 కోట్ల డోసుల వరకు నిల్వ ఉన్నాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 37.43 కోట్ల మంది కరోనా బాధితులుగా మారారు. 56.6 లక్షల మంది మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు 996 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ప్రజలు తీసుకున్నారని ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజాగా తెలిపింది.
Also Read: Bharat Bhushan Passes Away: ప్రముఖ ఫొటోగ్రాఫర్ భరత్ భూషణ్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం