India Corona Cases: దేశంలో నిన్న ఒక్కరోజులో 1,733 కరోనా మరణాలు.. కొత్తగా లక్షన్నర మందికి కొవిడ్
దేశ వ్యాప్తంగా కరోనాతో పోరాడుతూ నిన్న ఒక్కరోజులో 1,733 మంది మరణించారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 4,97,975కు చేరింది.
Covid Cases In India: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా.. మరణాలు మాత్రం ఆందోళనను పెంచుతున్నాయి. మొన్న ఒక్కరోజులో వెయ్యి పైగా మరణాలు నమోదు కాగా, నిన్న వాటి సంఖ్య మరింతగా పెరిగింది. మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా కరోనాతో పోరాడుతూ 1,733 మంది మరణించారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 4,97,975కు చేరింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,61,386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల కన్నా రెంట్టింపు సంఖ్యలో బాధితులు కోలుకున్నారు. నిన్న ఒక్కరోజులో 2,81,109 మంది కరోనాను జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,21,603కు తగ్గింది. రోజువారీ పాజిటివిటీ రేటు పది దిగువకు వచ్చింది. ప్రస్తుతం రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 9.26 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కానీ కొవిడ్19 మరణాల సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 167.29 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద దాదాపు 13 కోట్ల పైగా డోసుల వరకు నిల్వ ఉన్నాయని తెలిపింది.
ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 35,035 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 6,213 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 5 గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,620కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 10,795 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,62,033 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1,05,930 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: PM e-Vidya: వన్ క్లాస్- వన్ టీవీ ఛానెల్.. హైక్వాలిటీ కంటెంట్‌తో 200 టీవీ ఛానెళ్లు.. బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపు ఇదీ..
Also Read: Income Tax, Union Budget 2022: ఆదాయ పన్ను! మనం ఏం అడిగాం? నిర్మలమ్మ ఏం వడ్డించింది...?