అన్వేషించండి

PM e-Vidya: వన్ క్లాస్- వన్ టీవీ ఛానెల్.. హైక్వాలిటీ కంటెంట్‌తో 200 టీవీ ఛానెళ్లు.. బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపు ఇదీ..

ఈ వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం విద్య బోధించేందుకు ఉన్న 12 చానళ్లను ఏకంగా 200కు పెంచుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

మారుతున్న కాలం, పరిస్థితులకు తగ్గట్లుగా భారత్‌లో డిజిటల్ విద్యకు మరింత పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకోసం ‘వన్‌ క్లాస్‌- వన్‌ టీవీ ఛానల్‌’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం విద్య బోధించేందుకు ఉన్న 12 చానళ్లను ఏకంగా 200కు పెంచుతామని ప్రకటించారు. ఇది కనుక ఆచరణలోకి వస్తే ఇకపై అన్ని తరగతులకూ ప్రాంతీయ భాషలో ఒకేసారి డిజిటల్‌ విద్యాబోధన జరుగుతుందని భావిస్తున్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, టీవీలు, రేడియోలు, డిజిటల్ టీచర్ల ద్వారా అన్ని భాషల్లో హై క్వాలిటీతో కూడిన ఇ-కంటెంట్‌ను అందిస్తామని నిర్మల సీతారామన్ వివరించారు.

అయితే దేశంలో ఇప్పటికే 1 నుంచి 12వ తరగతి వరకు 12 చానళ్ల ద్వారా మాత్రమే డిజిటల్‌ తరగతులు జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం ఒకే ఒక్క టీ శాట్ అనే ఛానల్ ద్వారా ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో రోజుకు రెండు, మూడు తరగతుల విద్యార్థులకు మాత్రమే క్లాసులు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఛానళ్ల సంఖ్యను 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 200కు పెంచుతామని ప్రకటించడంతో ఈ సమస్య తీరిపోయే అవకాశం ఉంచవచ్చని భావిస్తున్నారు. డిజిటల్‌ తరగతులకు స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ బోర్డు కూడా ఉండాలి. ఇందుకు ఒక్కో బోర్డుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 

డిజిటల్ యూనివర్సిటీ కూడా..
డిజిటల్ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేస్తామని నిర్మల ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులకు వారి ఇంటి వద్దకే ప్రపంచస్థాయి విద్యను అందిస్తామని నిర్మల సీతారామన్ భరోసా ఇచ్చారు. వేర్వేరు ప్రాంతీయ భాషలు, ఐసీటీ ఫార్మట్స్‌లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. 

వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్ మార్పు.. కమిటీ
వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న సిలబస్‌ను సవరించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కొత్త పాఠ్యాంశాల్లో జీరో బడ్జెట్ వ్యవసాయం, సహజ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం, వాల్యూ అండ్ మేనేజ్మెంట్ వంటి అంశాలను కొత్తగా చేర్చనున్నట్లు తెలిపారు. సిలబస్ మార్పుల కోసం ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించనున్నారు.

ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గూడ్ న్యూస్ చెప్పారు. దేశంలో వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మేకిన్ ఇండియా ఈ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

PBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షోPunjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024Hardik Pandya Failures | PBKS vs MI మ్యాచ్ లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాండ్యా | ABP DesamAshutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Hardik Pandya Fitness: పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
My Dear Donga Movie Review - మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
Inter Exam Fee: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
Share Market Opening Today: బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
Embed widget